ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

author img

By

Published : Oct 1, 2021, 9:56 AM IST

Gold price
బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) భారీగా పెరిగింది. వెండి (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం భారీగా పెరిగింది. వెండి ధర (Silver price today) కిలోకు ఏకంగా రూ.1,000కిపైగా ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.500లకుపైగా పెరిగి.. రూ.47,905 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,060గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,905గా ఉంది. కిలో వెండి ధర రూ.61,060 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,905గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,060గా వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,754.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 22.08 డాలర్లకు పెరిగింది

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel prices) మరోసారి పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ ధర లీటర్​ (Petrol price today) 21-29 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​ (Diesel price today) 29-33 పైసల మధ్య ఎగబాకింది.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad)​ 25 పైసలు పెరిగి రూ.105.96 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్​ ధర 33 పైసలు ఎగబాకి.. రూ.98.35కు పెరిగింది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 23 పైసలు పెరిగి రూ.106.89కు చేరింది. లీటర్​ డీజిల్​ ధర 32 పైసలు పెరిగి రూ.98.79 వద్ద ఉంది.
  • గుంటూరులో పెట్రోల్​పై 24 పైసలు పెరిగి.. లీటర్​ ధర (Petrol Price in Guntur) రూ.108.16 వద్దకు చేరింది. డీజిల్​ లీటర్​కు 32 పైసలు పెరిగి.. రూ.100.02 వద్ద ఉంది.

ఇదీ చూడండి: అక్టోబర్ అలర్ట్.. నేటి నుంచి వచ్చిన మార్పులు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.