ETV Bharat / business

బంగారం షాపులకు కొత్త రూల్స్- ఇవి తెలుసుకోండి...

author img

By

Published : Jun 16, 2021, 1:29 PM IST

Updated : Jun 16, 2021, 2:05 PM IST

జువెలరీ దుకాణాల్లో హల్​మార్క్ ఉన్న నగలను మాత్రమే విక్రయించేలా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు బుధవారం అమలులోకి వచ్చాయి. మరి ఇంతకీ హాల్​మార్క్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు తీసుకొచ్చారు? దీనితో వినియోగదారులకు ఉపయోగం ఏమిటి? అని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Gold hallmarking mandatory from today
నగలపై హాల్​మార్కింగ్

బంగారు నగలపై హాల్​మార్కింగ్ తప్పని సరి చేస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ బుధవారం అమలులోకి వచ్చాయి. ఇకపై జువెలరీ దుకాణాలు హాల్​మార్క్​ ఉన్న నగలు, కళాకృతులు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.

బంగారంపై హాల్​మార్కింగ్ అనేది దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఈ మార్కింగ్​ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​ (బిస్​) 2000 ఏప్రిల్​లో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఇది స్వచ్ఛందంగా మాత్రమే అమలులో ఉంది.

అయితే వినియోగదారులకు మరింత భద్రత కలిపించడం, మోసాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో.. బంగారు నగలపై హాల్​మార్కింగ్​ను తప్పనిసరి చేస్తూ 2019 నవంబర్​లో నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. ఈ నిబంధనల అమలు బుధవారం ప్రారంభమైంది.

హాల్​మార్కింగ్ గురించి పూర్తి వివరాలు..

  • ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది.
  • హాల్​మార్కింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్​లైన్​ ద్వారా ఉంటుంది.
  • గడిచిన ఐదేళ్లలో హాల్​మార్కింగ్ సెంటర్ల సంఖ్య 25 శాతం పెరిగింది. 14 కోట్ల ఆభరణాలకు హాల్​మార్కింగ్ ఇచ్చే సామర్థ్యం ఈ కేంద్రాలకు ఉంది.
  • ప్రస్తుతం మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి హాల్​మార్కింగ్ ఉంటోంది.
  • తక్కువ క్యారెట్ బంగారాన్ని విక్రయించకుండా హాల్​మార్కింగ్ నిరోధిస్తుంది. బంగారం స్వచ్ఛత వివరాలు ఆభరణాలపై ముద్రిస్తారు కాబట్టి వినియోగదారులకు హాల్​మార్కింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.
  • ప్రస్తుతం దేశంలో 4 లక్షల ఆభరణ తయారీదారులు ఉన్నారు. ఇందులో 35,879 మందికి మాత్రమే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్​లో బీఐఎస్ ధ్రువీకరణ ఉంది.
  • బంగారు నగలు, కళాకృతులకు మాత్రమే హాల్​ మార్కింగ్ తప్పనిసరి. బులియన్, గోల్డ్​ కాయిన్స్​కు ఇది వర్తించదు.
  • ఒక వేళ హాల్​మార్కింగ్ చేసిన నగల్లో స్వచ్ఛత లోపం ఉంటే.. దానికి సర్టిఫికేట్ ఇచ్చిన సంస్థను బాధ్యులను చేస్తారు. చట్ట రీత్యా వారికి శిక్ష లేదా కనీసం రూ.లక్ష జరిమానా విధిస్తారు.
  • హాల్​మార్కింగ్ విషయంలో లోపాలు, తప్పుల గురించి సమీపంలోని బిస్ ఆఫీస్​లో లేదా.. ఆన్​లైన్​లో బిస్ మొబైల్​యాప్​, వెబ్​సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ఇదీ చదవండి:బంగారం కాస్త ప్రియం- పెట్రోల్​ రేట్ల కొత్త రికార్డు

Last Updated : Jun 16, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.