ETV Bharat / business

పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Oct 28, 2021, 11:04 AM IST

బంగారం ధర (Gold price Today) పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.211 మేర పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

gold price
బంగారం ధర

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. గురువారం రూ.211 మేర పెరిగి.. పది గ్రాముల మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.49,590గా ఉంది. వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకోగా.. కిలో వెండి ధర (Silver price today)రూ.22 తగ్గి.. రూ.66,474కు చేరింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,474కి చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,368 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.66,474 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,474 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా.. 12

అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 11 డాలర్లు పెరిగి.. రూ.1801 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.06 డాలర్లు పలుకుతోంది.

'పెట్రో' మోత

దేశంలో 'పెట్రో' బాదుడు కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) తెలిపాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.29కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.09కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.112.59కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.80 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​కు రూ.114.60కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.19 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.113.33 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.96కి చేరింది.

ఇదీ చూడండి: మారుతీ సుజుకీ లాభంలో 66% క్షీణత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.