ETV Bharat / business

ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్​ఎస్​సీ ' పురోగతిపై కీలక చర్చ!

author img

By

Published : Nov 20, 2021, 2:31 PM IST

గుజరాత్​లోని గిఫ్ట్​ సిటీ(GIFT City in Gujarat ) ద్వారా.. ఎయిర్​క్రాఫ్ట్ లీజింగ్, బులియన్ ట్రేడింగ్, గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ప్రధాని మోదీ మానసపుత్రిక అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్​ఎస్​సీ) పురోగతి, అభివృద్ధపై నేడు గిఫ్ట్​ సిటీలో కీలక చర్చ జరగనుంది.

FM Sitharaman
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) మానసపుత్రిక, ఆయన కలల ప్రాజెక్టు అయిన అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్​సీ)(IFSC) పురోగతి, అభివృద్ధిపై నేడు కీలక చర్చ జరగనుంది. గుజరాత్ ప్రభుత్వం, గిఫ్ట్ సిటీ(GIFT City in Gujarat), ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ(ఐఎఫ్ఎస్​సీఏ) భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచస్థాయి ఆర్థిక నిబంధనలు, పోటీతత్వంతో కూడిన పన్ను విధానాలను తీసుకురావడం సహా బలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
వినూత్నమైన, వైవిధ్యమైన ఆర్థిక ఉత్పత్తులు, సేవలను పొందేందుకు గిఫ్ట్ సిటీ(GIFT city news) వీలు కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఎయిర్​క్రాఫ్ట్ లీజింగ్, బులియన్ ట్రేడింగ్, గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను గిఫ్ట్ సిటీ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అంకురాల ఎదుగుదలకు తోడ్పడే బెస్ట్-ఇన్-లీగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తో కూడిన ఫిన్​టెక్ యాక్సిలరేటర్స్, ల్యాబ్​లు గిఫ్ట్ సిటీలో ఉంటాయని వివరించింది. ప్రపంచస్థాయి కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని తెలిపింది.

నిర్మల నేతృత్వంలో..

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్​సీ) పురోగతి, అభివృద్ధిపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్​లోని గాంధీనగర్​కు వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సాఖ అధికారుల బృందంతో కలిసి అక్కడి గిఫ్ట్ సిటీని సందర్శించనున్నారు. ఆర్థిక శాఖలో ఇద్దరు జూనియర్ మంత్రులు అయిన పంకజ్ చౌధరి, భాగవత్ కిషన్​రావ్​లు సైతం నిర్మలతో కలిసి చర్చల్లో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: సృజన, నైపుణ్యాల కలబోతతో.. 'గేమింగ్' ఉజ్జ్వల భవిత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.