ETV Bharat / business

ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ మస్క్

author img

By

Published : Mar 16, 2021, 10:56 AM IST

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ను వెనక్కి నెట్టి.. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ మరోసారి ప్రపంచ అపర కుబేరుడి కిరీటాన్ని దక్కించుకున్నారు. టెస్లా షేర్లు సోమవారం 2 శాతానికిపైగా పుంజుకోవడం ఇందుకు కారణం. మస్క్ నికర విలువ 182 బిలియన్ డాలర్లని అంచనా.

Elon Musk reclaims world's richest
ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలన్​ మస్క్

ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. టెస్లా షేర్లు సోమవారం 2 శాతానికిపైగా పెరిగిన నేపథ్యంలో మస్క్ సంపద.. 182 బిలియన్​ డాలర్లకు చేరింది. దీనితో ప్రపంచ కుబేరుల్లో అగ్ర కిరీటాన్ని దక్కించుకున్నారు మస్క్.

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ 181 బిలియన్​ డాలర్ల సంపదతో ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

నిజానికి ఈ ఏడాది జనవరిలో మస్క్ మొత్తం సంపద 210 బిలియన్​ డాలర్లుగా ఉండేది. అయితే ఆయన చెసిన కొన్ని ట్వీట్లు సహా పలు ఇతర కారణాల షేర్ల విలువ క్షీణించి, సంపద భారీగా తగ్గింది. దీనితో జెఫ్​ బెజోస్​ ప్రపంచంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు.

టైటిళ్లు మార్పు.. పదవులు అవే..

తమ సీఈఓ ఎలాన్​ మస్క్​కు 'టెక్​నోకింగ్ ఆఫ్​ టెస్లా'​ టైటిల్​ను ఇస్తున్నట్లు టెస్లా సోమవారం ప్రకటించింది. చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్​ (సీఎఫ్​ఓ)ను 'మాస్టర్​ ఆఫ్​ కాయిన్​'గా పిలవనున్నట్లు పేర్కొంది. ఈ మార్పులకు కారణాలు మాత్రం వెల్లడించలేదు టెస్లా. కొత్త టైటిళ్లు ఇచ్చినా వారు అవే పదవుళ్లో కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే వారికి అదనపు బాధ్యతలు ఏవైనా ఇవ్వనున్నారా? అనే విషయంపై స్పష్టతనివ్వలేదు.

ఇదీ చదవండి:అంతర్జాలం... రేట్ల మాయాజాలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.