సాయంలో మస్క్ రికార్డ్- పిల్లల కోసం 570 కోట్ల డాలర్ల షేర్లు విరాళం!

author img

By

Published : Feb 15, 2022, 2:40 PM IST

Elon Musk

Elon musk giving to charity: చిన్నారుల ఆకలి తీర్చేందుకు మస్క్​ ముందుకు వచ్చారు. టెస్లాలోని సుమారు 5 మిలియన్ల షేర్లను విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారు సుమారు 5.7 బిలియన్​ డాలర్లు.

Elon musk giving to charity: టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు ఐదు మిలియన్​ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు చూపించారు.

మస్క్​ ఇచ్చిన ఈ విరాళం విలువ ఆ రోజుల్లో షేర్ల సగటు ధర ప్రకారం సుమారు 5.7 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ట్రస్ట్​ వివరాలు పొందుపరచలేదు.

శ్రీమంతులు తలచుకుంటే ప్రపంచ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే గతంలో అన్నారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన మస్క్​ మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ఏజెన్సీకి ఇచ్చేందుకు నేను సిద్ధమేనని అన్నారు. ఈ మేరకు తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు మస్క్​.

గతేడాది అమెరికా చరిత్రలో అత్యధికంగా పన్ను కట్టే వారిలో మస్క్​ ఒకరుగా ఉన్నారు. ఆయన విరాళం ప్రకటించడం వల్ల 10 బిలియన్ డాలర్ల మేర పన్ను మినహాయింపులు వర్తించాయని ఓ మీడియా సంస్థ అంచనా వేసింది.

ఇదీ చూడండి:

'బిగ్​బుల్​'కు పది నిమిషాల్లోనే రూ.186 కోట్ల లాభం!

'మా టీకాల వల్ల మూడు కోట్లకుపైగా ప్రాణాలు సేఫ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.