ETV Bharat / business

గుడ్​ న్యూస్.. రూ. 40 తగ్గిన వంట నూనెల ధరలు

author img

By

Published : Dec 31, 2021, 7:20 AM IST

EDIBLE OIL PRICE DECREASE
గుడ్​ న్యూస్.. వంట నూనెల ధరలు తగ్గాయ్..

Edible oil Price Decrease: వంట నూనెల వినియోగదారులకు గుడ్​ న్యూస్​. ప్రధాన ఆయిల్ కంపెనీలు తమ వంట నూనె ఉత్పత్తుల ధరలను ఎమ్​ఆర్​పీపై రూ. 30-40 తగ్గించాయి.

Edible oil Price Decrease: సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ ప్రధాన కంపెనీలు తమ వంటనూనె ఉత్పత్తుల ధరలను ఎమ్ఆర్​పీపై రూ. 30-40 తగ్గించాయి. ఈ మేరకు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో తెలిపింది.

ఏఏ బ్రాండ్​లంటే..?

అదానీ విల్​మార్​ (ఫార్చ్యూన్​ బ్రాండ్​), రుచి సోయ( మహాకోష్​, సన్​రిచ్​, రుచి గోల్డ్​, న్యూట్రెల్లా బ్రాండ్స్​), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్​), బంగే​(డాల్డా, గగన్​, ఛంబల్ బ్రాండ్స్), జెమిని(ఫ్రీడమ్ సన్​ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్​), సీఓఎఫ్​సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్‌లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్‌లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్‌లు)తో పాటు ఇతర బ్రాండ్‌లు కూడా ధరలు తగ్గించాయని ఎస్ఈఏ పేర్కొంది.

"వంట నూనెల ధరల తగ్గింపుపై ప్రధాన కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ఎమ్​ఆర్​పీపై రూ. 30-40 తగ్గించాయి. వచ్చే పండుగ ముందు ఈ విషయాన్ని తెలుపడానికి సంతోషిస్తున్నాము."

-ఎస్​ఈఏ(సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌​ ఆఫ్ ఇండియా)

Edible Oil Price News: వంట నూనెల ధరల తగ్గింపుపై కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే.. ప్రధాన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా కంపెనీలు ఇటీవలే ప్రకటించాయి.

వంట నూనెల ఉత్పత్తులపై దిగుమతి పన్ను భారాన్ని కేంద్రం ఇటీవల తగ్గించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌​పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం​ నుంచి 12.5 శాతానికి సవరించింది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులకు అనుమతించింది.

ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో దుస్తులు, పాదరక్షల ధరలకు రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.