ETV Bharat / business

కొత్త ఏడాదిలో దుస్తులు, పాదరక్షల ధరలకు రెక్కలు!

author img

By

Published : Dec 26, 2021, 4:11 PM IST

Changes in GST Rates: నూతన సంవత్సరంలోనూ ధరల మోత తప్పేలా లేదు. ఈ ఏడాది పెట్రో ఉత్పత్తులు సహా పలు నిత్యవసర వస్తులు ధరలు ఆకాశాన్ని తాకగా.. వచ్చే ఏడాది దుస్తులు, పాదరక్షలు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు జీఎస్​టీ చట్టంలో చేసిన మార్పులు జనవరి 1న అమల్లోకి రానున్నాయి.

Changes in GST Rates
Changes in GST Rates

Changes in GST Rates: కొత్త ఏడాదిలో వస్తు, సేవల పన్ను(జీఎస్​టీ) విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. జనవరి 1న పాలనపరమైన, విధానపరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఆన్​లైన్​ ద్వారా అందించే సేవలపైన ఇ-కామర్స్​ సంస్థలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను ఎగవేతను అరికట్టేలా జీఎస్​టీ చట్టాన్ని కేంద్రం సవరించింది. ఫలితంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి.

జనవరి 1 నుంచి జీఎస్​టీలో వచ్చే మార్పులివే..

  • పాదరక్షలు, వస్త్ర రంగాల్లో విలోమ పన్ను నిర్మాణంలో దిద్దుబాటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ధరలతో సంబంధం లేకుండా అన్ని పాదరక్షలు 12 శాతం జీఎస్​టీ పరిధిలోకి వస్తాయి.
  • రెడీమేడ్​ దుస్తులు సహా అన్ని వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్​టీ చెల్లించాలి. అయితే కాటన్​కు మినహాయింపు ఉంది.
  • ఇ-కామర్స్​ సంస్థలు అందించే సేవలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్​, ఓలా, రాపిడో సంస్థలు.. క్యాబ్​, ఆటోరిక్షా, బైక్​ల ద్వారా ప్రయాణికులకు అందించే సేవలపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్​లైన్​లో క్యాబ్​, ఆటోరిక్షా ద్వారా ప్రయాణించేవారికి జీఎస్​టీ నుంచి మినహాయింపు ఉంది.
  • స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్​ సర్వీస్​ ప్రొవైడర్లు.. రెస్టారెంట్ సేవలపై జీఎస్​టీని సేకరించి, ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. అలాగే బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను రెస్టారెంట్లు నిర్వహించేవి. ఇకపై ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహిస్తాయి.
  • జీఎస్​టీ రీఫండ్​ కోసం ఆధార్​ ధ్రువీకరణ తప్పనిసరి.
  • ముందు నెలలో జీఎస్​టీఆర్​-3బీని దాఖలు చేసి.. వ్యాపారులు పన్నులు చెల్లించని సందర్భంలో జీఎస్​టీఆర్​-1 దాఖలుకు ఇకపై అవకాశం ఉండదు.
  • పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడితే.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా జీఎస్​టీ అధికారులు పన్ను బకాయిలను రికవరీ చేయవచ్చు.

ఇదీ చూడండి: 'బీమా రంగంలో ఆవిష్కరణలు- వ్యక్తులకు నచ్చినట్లుగా పాలసీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.