ETV Bharat / business

Corona Vaccine: ఇక వాట్సాప్‌లోనూ టీకా 'స్లాట్‌ బుకింగ్‌'

author img

By

Published : Aug 24, 2021, 11:42 AM IST

కొవిడ్ మూడోవేవ్(Thirdwave of Corona) వార్తల నేపథ్యంలో వీలైనంత త్వరగా.. ప్రజలందరికీ టీకాలు(Corona Vaccine) అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాట్సాప్​లోనూ టీకా స్లాట్ బుకింగ్(Vaccine Registration) చేసుకునే వీలు కల్పిస్తోంది. మరి వాట్సాప్​లో టీకాను ఎలా బుక్​ చేసుకోవాలంటే..?

Corona Vaccine
కొవిడ్ వ్యాక్సిన్

కరోనా మూడో దశ (Corona Thirdwave) ముప్పు పొంచి ఉన్న వేళ వీలైనంత వేగంగా అర్హులైన వారందరికీ టీకాలు(Vaccination) ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్‌ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇకపై వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను (Vaccine Registration) బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

"పౌరుల సేవలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం. ఇక కరోనా వ్యాక్సిన్‌ స్లాట్లను అత్యంత సులువగా మీ ఫోన్‌లోనే క్షణాల్లో బుక్‌ చేసుకోవచ్చు." అని కేంద్రమంత్రి ప్రకటించారు. దీంతో పాటు వాట్సాప్‌ ద్వారా ఎలా బుక్‌ చేసుకోవాలో కూడా వివరించారు. అటు మై గవర్న్‌మెంట్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతాలోనూ ఈ కొత్త సదుపాయం గురించి ట్వీట్‌ చేశారు.

మరి వాట్సాప్‌ ద్వారా టీకా స్లాట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

  • ఇందుకోసం ముందు My Gov India Corona Helpdesk నంబరు 91-9013151515ను మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాట్సాప్‌లో ఈ నంబరుకు 'Book Slot' అని మెసేజ్‌ పంపాలి.
  • అప్పుడు మీ ఫోన్‌ నంబరుకు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి నంబరు వెరిఫై చేసుకోవాలి.
  • ఆ తర్వాత తేది, లొకేషన్‌, పిన్‌కోడ్‌, వ్యాక్సిన్‌ టైప్‌ తదితర వివరాలను నింపాలి.
  • అన్నీ పూర్తయ్యాక Confirm చేస్తే మీకు స్లాట్‌ బుక్‌ అవుతుంది.

కరోనా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్‌ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని 'My Gov Corona Helpdesk'.. ఇటీవల టీకా ధ్రువపత్రాన్ని కూడా వాట్సాప్‌ ద్వారా పొందే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే.

ఇందుకోసం 9013151515 నంబరుకు వాట్సాప్‌లో 'Download Certificate' అని మెసేజ్‌ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకుని, పేరును ధ్రువీకరిస్తే మీ టీకా సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

ఇదీ చదవండి: షార్ట్​కట్​ ఫీచర్​తో వాట్సాప్ పేమెంట్ మరింత ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.