ETV Bharat / business

ఎస్​ బ్యాంకు రానా కపూర్​పై మరో సీబీఐ కేసు

author img

By

Published : Mar 14, 2020, 8:24 AM IST

ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్‌, ఆయన భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్‌ గౌతమ్ థాపర్‌పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. థాపర్​ సంస్థలకు రూ.1,500 కోట్ల రుణాల మంజూరు విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసింది.

rana kapoor
రానా కపూర్​

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్​పై మరో కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. థాపర్​ సంస్థలకు రూ.1,500 కోట్లు రుణం ఇచ్చిన కేసులో కపూర్​తో పాటు ఆయన భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్​ గౌతమ్​ థాపర్​ పేర్లను చేర్చింది.

రుణాలు మంజూరు చేసే విషయంలో నిబంధనలను సడలించడం సహా లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి దిల్లీ, ముంబయిలోని రానా కపూర్‌, గౌతమ్ థాపర్‌ నివాసాలు, కార్యాలయాలతోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ ఎస్ బ్యాంక్​'కు కేంద్రం గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.