రూ.36 వేలకే ఎలక్ట్రిక్​ స్కూటర్​- ఫీచర్స్​ అదుర్స్​!

author img

By

Published : Dec 4, 2021, 3:09 PM IST

bounce infinity electric scooter
బౌన్సీ ఇన్ఫినిటీ స్కూటర్‌ ()

Bounce Infinity Electric Scooter: ఓలా లాంటి ట్రావెల్​ బుకింగ్​ సంస్థ బౌన్స్​ తన తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను భారతీయ మార్కెట్​లోకి విడుదల చేసింది. ఆ స్కూటర్​ ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

Bounce Infinity Electric Scooter: రైడ్​ బుకింగ్​ సంస్థ అయిన బౌన్స్​​.. తన మొదటి ఎలక్ట్రిక్​ స్కూటీని విడుదల చేసింది. అందరికీ అందుబాటులో ఉండేలా దీని ధరను నిర్ణయించింది. దీనికి తోడు అనేక ప్రత్యేక ఫీచర్లను జోడించింది. అవి ఏంటో తెలుసుకుందాం.

bounce infinity electric scooter
తెలుపు రంగులో బౌన్స్​ స్కూటర్​

Bounce Infinity Electric Scooter Price..

ధర...

బౌన్స్​​ తీసుకువచ్చిన మొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ విలువ కేవలం రూ. 68,999 గా నిర్ణయించింది. స్కూటర్​తో పాటు బ్యాటరీ, ఛార్జర్​ను ఇవ్వనుంది సంస్థ. అంతేగాకుండా బ్యాటరీ లేకుండా ఈ స్కూటర్​ను తీసుకున్నట్లైతే.. కేవలం రూ. 36 వేలకే రానున్నట్లు సంస్థ తెలిపింది.

bounce infinity electric scooter
36 వేలకే స్కూటర్​

ఎలక్ట్రిక్​ స్కూటర్లకు సంబంధించి ఇప్పటికే మార్కెట్​లో పోటీదారులుగా ఉన్న ఓలా ఎస్​ఓన్​, బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​, టీవీఎస్​ ఐక్యూబ్​, అథేర్​ 450X లాంటి కంపెనీలకు ధర విషయంలో గట్టి సవాలు విసిరింది బౌన్స్. డిసెంబర్​ రెండో వారం నుంచి టెస్ట్​ రైడ్స్​ను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ ఈవీలను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

Bounce Infinity Electric Scooter Features..

బౌన్స్​ ఈవీ ఫీచర్లు...

బ్యాటరీ..

బౌన్స్​ ఇన్ఫినిటీ స్కూటర్‌తో పాటు బ్యాటరీని విడిగా కూడా తీసుకునే అవకాశం కల్పించింది సంస్థ. దీని వల్ల వినియోగదారులు బ్యాటరీ లేకుండా ఈ ఈవీని కొనుగోలు చేయవచ్చు. దీంతో వినియోగదారులు కావాలంటే ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది.

bounce infinity electric scooter
బ్యాటరీ

సింగిల్​ ఛార్జ్​తో 85 కి.మీ..

బౌన్స్​ ఇన్ఫినిటీ స్కూటర్‌లో ఉండే బ్యాటరీని ఒకసారి ఛార్జ్​ చేస్తే.. సుమారు 85 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది. గరిష్ఠంగా 65 కి.మీ వేగంతో ఈ స్కూటర్​పై ప్రయాణించవచ్చని చెప్పింది.

డ్రాగ్​ మోడ్​..

ఈ స్కూటర్​లో ఉన్న మరో ఫీచర్​.. డ్రాగ్​ మోడ్​. దీని ద్వారా స్కూటర్​కు పంక్చర్​ అయితే ఇది వాహనదారుడిని వెంటనే అప్రమత్తం చేస్తుంది. డ్రాగ్​ మోడ్​తో పాటు.. దీనిలో పవర్​ అండ్​ ఎకో మోడ్​లు కూడా ఉన్నాయి.

bounce infinity electric scooter
బ్లాక్​ కలర్​లో ఈవీ

కనెక్టివిటీ..

ఈ స్కూటర్​ను స్మార్ట్​ఫోన్​తో కనెక్ట్​ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్​ను సిద్ధం చేసింది బౌన్స్​. దీని ద్వారా స్కూటర్​కు సంబంధించిన సమాచారంతో పాటు కొన్ని ఫీచర్లను ఫోన్​ నుంచే ఆపరేట్​ చేయవచ్చు.

bounce infinity electric scooter
హెడ్​​ ల్యాంప్​

రెట్రో-మోడ్రన్​ డిజైన్​తో...

బౌన్స్​ నుంచి వచ్చే ఈ ఈవీ.. రెట్రో-మోడ్రన్​ డిజైన్​తో రానుంది. రెట్రో స్టైల్​తో, మోడ్రన్​ ఎలిమెంట్స్​తో రూపొందించారు. దీనిలో ఎల్​ఈడీ హెడ్​ ల్యాంప్​, పగటి పూట వెలుగుతుండే లైట్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, అల్లాయ్​ వీల్స్​, ముందు, వెనక చక్రాలకు డిస్క్ బ్రేక్​లు లాంటి ఫీచర్లు ఈ స్కూటర్​లో ఉండనున్నాయి.

bounce infinity electric scooter
అల్లాయ్​ వీల్స్
bounce infinity electric scooter
హెల్మెట్​ పెట్టుకునేందుకు వీలుగా...

ఐదు రంగుల్లో...

బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1 పేరుతో వస్తున్న ఈ స్కూటర్​ మొత్తంగా ఐదు రంగుల్లో రానుంది. స్పార్కెల్​ బ్లాక్​, కొమెట్​ గ్రే, స్పోర్టీ రెడ్​, పెరల్​ వైట్​, డీసాట్​ సిల్వర్​ రంగుల్లో ఉండనుంది.

bounce infinity electric scooter
బౌన్స్​ ఇన్ఫినిటీ స్కూటర్​

ఫుల్లీ డిజిటల్​ స్పీడో మీటర్​...

ఈ స్కూటర్ ఫుల్లీ డిజిటల్​ స్పీడో మీటర్​తో రానుంది. స్కూటీకి సంబంధించిన సమాచారం ఆ డిజిటల్​ మీటర్​లో రైడర్​ చూడొచ్చు. ముఖ్యంగా ఇగ్నిషన్​ స్టేటస్​, సైడ్​ స్టాండ్​, ఇండికేటర్స్, బ్యాటరీ స్టేటస్​, స్పీడ్​ డిస్​ప్లే, ఓడో మీడర్​ రీడింగ్​, వెహికల్​​, బ్లూటూత్​ ​, హై బీమ్​ స్టేటస్​ను చూడవచ్చు.

bounce infinity electric scooter
డిజిటల్​ స్పీడో మీటర్​

ఇదీ చూడండి: జనవరి నుంచి ఆ కార్లు మరింత కాస్ట్​లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.