ETV Bharat / business

Bank Holidays in January 2022: జనవరిలో 16 రోజులు బ్యాంకులు బంద్​!

author img

By

Published : Dec 30, 2021, 6:30 AM IST

ఆర్థిక లావాదేవీల కోసం జనవరిలో బ్యాంక్‌కు వెళ్లాలా? అయితే ఈ సమాచారం మీ కోసమే! దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలిపి జనవరిలో మొత్తం 16 సెలవు దినాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.

Bank Holidays in January 2022
Bank Holidays in January 2022

Bank Holidays in January 2022: జనవరిలో బ్యాంకు సెలవుల క్యాలెండర్​ను ఆర్​బీఐ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 16 రోజులు బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది. వీటిని గమనించి వినియోగదారులు తమ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది. ప్రాంతాల వారీగా బ్యాంకు​ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. జనవరి 1: నూతన సంవత్సర వేడుకలు (ఐజ్వాల్​, చెన్నై, గ్యాంగ్​టక్​, షిల్లాంగ్​)
  2. జనవరి 2: ఆదివారం
  3. జనవరి 3: న్యూఇయర్​, లోసూంగ్​ వేడుకలు (ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌)
  4. జనవరి 4: లోసూంగ్​ సెలబ్రేషన్స్​ (గ్యాంగ్​టక్​)
  5. జనవరి 8: రెండో శనివారం
  6. జనవరి 9: ఆదివారం
  7. జనవరి 11: మిషనరీ దినోత్సవం (ఐజ్వాల్​)
  8. జనవరి 12: స్వామి వివేకానంద జయంతి (కోల్​కత్తా)
  9. జనవరి 14: మకర సంక్రాంతి, పొంగల్​ (అహ్మదాబాద్​, చెన్నై,)
  10. జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి, సంక్రాంతి, పొంగల్​, తిరువళ్లువర్​ దినోత్సవం (బెంగళూరు, చెన్నై, గ్యాంగ్​టక్​, హైదరాబాద్​)
  11. జనవరి 16: ఆదివారం
  12. జనవరి 18: తైపూసం(చైన్నై)
  13. జనవరి 22: నాలుగో శనివారం
  14. జనవరి 23: ఆదివారం
  15. జనవరి 26: గణతంత్ర దినోత్సవం (అగర్తల, భోపాల్​, భువనేశ్వర్​, చండీగఢ్, గువహటి, ఇంఫాల్​, జైపుర్​, కొచ్చి, శ్రీనగర్​ మినహా దేశమంతా​)
  16. జనవరి 30: ఆదివారం

మూడు కేటగిరీల కింద బ్యాంకులకు ఆర్​బీఐ సెలవులు ఇస్తుంది. హాలిడే అండర్​ నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ యాక్ట్​, రియల్​ టైమ్​ గ్రాస్​ సెటిల్​మెంట్​ హాలీడే, బ్యాంకుల అకౌంట్స్​ క్లోజింగ్​ కింద సెలవులు మంజూరు చేస్తుంది.

ఇదీ చూడండి: 'పవర్​ సాకెట్​లో కాయిన్​ పెట్టు'.. చిన్నారికి అలెక్సా ఛాలెంజ్.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.