భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు.. కిలోలీటర్​ రూ.లక్ష పైనే..

author img

By

Published : Mar 16, 2022, 12:51 PM IST

atf-price-hiked-by-steepest-ever-18-pc-to-all-time-high

ATF Price: విమాన ఇంధన ధరలు చరిత్రలో ఎన్నడు లేనంత రికార్డు స్థాయికి చేరాయి. దిల్లీలో కిలోలీటర్ ధర రూ.లక్ష మార్కును అధిగమించింది.

ATF Price Hike: విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కిలోలీటర్​ ఏకంగా 18 శాతం వృద్ధి చెంది రూ.లక్ష మార్కును అధిగమించింది. ఎయిర్​ టర్బైన్​ ఫ్యూయల్ (ATF) ధరలు ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం విమాన ఇంధన ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది.

ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తారు. ఏ ఏడాది ధరలు పెరగడం వరుసగా ఇది ఆరోసారి. కొత్త ధర ప్రకారం దిల్లీలో కిలోలీటర్​ ఏటీఎఫ్​ రూ.17,135 (18శాతం) పెరిగి రూ.110,666కి చేరింది. గతవారం అంతర్జాతీయంగా చమురు బ్యారెల్​ ధర రికార్డు స్థాయిలో 140 డాలర్లకు పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. దీంతో విమాన ఇంధన ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏటీఎఫ్ ధర 50 శాతం పెరగడం గమనార్హం.

పెరిగిన ధరలతో ముంబయిలో​ కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.109,119కి చేరగా.. కోల్​కతాలో ఏకంగా రూ.114,980కి పెరిగింది. చెన్నైలో రూ. 114,134గా ఉంది.

2008 బ్యారెల్​ చమురు ధర రికార్డు స్థాయిలో 147 డాలర్లు ఉన్నప్పుడు కిలోలీటర్​ ఏటీఎఫ్ ధర రూ.71,028గా ఉంది. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు గతవారం రికార్డు స్థాయికి చేరాయి. అయితే బుధవారం ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్​ చమురు ధర 100డాలర్లకు దిగొచ్చింది.

ఇదీ చదవండి: 'సర్కారు వారి క్రిప్టోకరెన్సీ'.. కేంద్రం ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.