ETV Bharat / briefs

వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు...

author img

By

Published : Jun 12, 2020, 6:34 PM IST

వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు
వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు

వివాహ వేడుకకు వెళ్తున్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ విషాదం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి శివారులో జరిగింది.

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగారం మండలం నర్సింహులగూడెంలో ఓ వివాహ వేడుకకు హాజరవడానికి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రసందీప్ (22), జెర్రిపోతుల హరీశ్ (23) ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.

ఈ క్రమంలో సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్ర సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీశ్​కు తీవ్ర గాయాలు కాగా... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.