ETV Bharat / state

cm kcr plans district tours: సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన తేదీల్లో మార్పులు

author img

By

Published : Dec 17, 2021, 6:39 PM IST

Updated : Dec 17, 2021, 7:30 PM IST

CM KCR: సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన తేదీల్లో మార్పులు
CM KCR: సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన తేదీల్లో మార్పులు

18:33 December 17

CM KCR: సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన తేదీల్లో మార్పులు

cm kcr plans district tours : సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తారు. 23న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. గతంలో నాలుగు జిల్లాల్లో సీఎం పర్యటించారు. గురువారం వనపర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి... నూతన కలెక్టరేట్​ను ప్రారంభిస్తారు.

శంకుస్థాపనలు.. బహిరంగ సభలు

కొత్త మార్కెట్ యార్డును, రెండు పడకల గదుల ఇళ్లను కూడా ప్రారంభిస్తారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్... పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం జనగామలో..

cm kcr plans district tours : వనపర్తి జిల్లా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్​ జనగామ పర్యటనకు వెళ్తారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​ను ప్రారంభిస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తెరాస జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇతర జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఆ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం... ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, జలాశయానికి శంకుస్థాపన చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొత్త కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాల్లో పూర్తైన తెరాస జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి: CM kcr meets ministers : ఎల్లుండి నుంచి సీఎం కేసీఆర్ వరుస కార్యక్రమాలు

Last Updated :Dec 17, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.