ETV Bharat / crime

Ganza seized in Hyderabad: గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం

author img

By

Published : Dec 17, 2021, 4:26 PM IST

Updated : Dec 17, 2021, 7:40 PM IST

90 lakh worth of ganza seized in Hyderabad
90 lakh worth of ganza seized in Hyderabad

16:23 December 17

Ganza seized in Hyderabad: గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం

గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం

Ganza seized in Hyderabad: హైదరాబాద్​లో మరోసారి గంజాయి గుప్పుమంది. ఏకంగా రూ.90 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న 10 మందిని రాచకొండ ఎస్వోటీ పొలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల నగదు, ఓ లారీ, రెండు కార్లు, 19 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు పట్టుకున్న దాంతో కలిపి ఈ ఏడాది 5 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని రాచకొండ సీపీ మహేష్​భగవత్​ తెలిపారు.

పరారీలో కీలక నిందితుడు..

"ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముఠాను వనస్థలిపురంలో అరెస్ట్ చేశాం. ఏవోబీ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్​లోని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని ముంబయి తరలిస్తుండగా పట్టుకున్నాం. 240 కేజీల గంజాయిని సీజ్ చేశాం. ఈ కేసులో మొత్తం 11 మంది ఉండగా.. 10 మంది నిందితులను అరెస్ట్ చేశాం. కీలక నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నాడు. కేరళకు చెందిన శివన్​కృష్ణన్​ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడుగా గుర్తించాం. పట్టుకున్న సొత్తు విలువ 90 లక్షలు ఉంటుంది." - మహేష్​భగవత్​, రాచకొండ సీపీ

ఇదీ చూడండి:

Last Updated :Dec 17, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.