ETV Bharat / bharat

టిక్కెట్​ ఎవరికి దక్కే'నో' ? - సీఎం క్యాంప్​ ఆఫీస్​లో చర్చోపచర్చలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 3:54 PM IST

Updated : Jan 8, 2024, 6:52 PM IST

YS Jagan Meet with MPs and MLAs : వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్సీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు భారీ స్థాయిలో మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న నేతలంతా తాడేపల్లి చేరుకుంటున్నారు.

cm_jagan_meet
cm_jagan_meet

YS Jagan Meet with MPs and MLAs : అధికార వైసీపీలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీట్ల ఆందోళన పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు సీట్లు ఎక్కడ మారుతుందోనని, తమకు బెర్తు దక్కుతుందా లేదోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. పలు నియోజకవర్గాల ఇన్ చార్జీలను మార్చుతోన్న సీఎం జగన్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. నేతలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి మరీ మాట్లాడుతున్నారు. సీటు లేదని కొందరికి, సీటు మారాలని మరికొందరికి, కొనసాగాలని మరికొందరికి చెబుతున్నారు. సీట్లు దక్కని వారు క్యాంపు కార్యాలయం నుంచి తీవ్ర అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. తుది జాబితాను వీలైనంత త్వరలో వైసీపీ అధిష్ఠానం ప్రకటించే అవకాశాలున్నాయి.

టిక్కెట్​ ఎవరికి దక్కే'నో'? - సీఎం క్యాంప్​ ఆఫీస్​లో చర్చోపచర్చలు

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవోకి ప్రజాప్రతినిధులు 'క్యూ'

ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను మార్చి 11మంది సిట్టింగులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం జగన్ మరిన్ని స్థానాల్లో మార్పు దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దో రోజులుగా నియోజక వర్గాల ఇన్ చార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీలను సీఎం వైఎస్ జగన్ మార్చుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పిలుపు మేరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మరోసారి తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎంవో కు వచ్చారు. పార్టీలో జరిగే పరిణామాలపై ఇటీవలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తనకు సీఎం ను కలిసేందుకు అవకాశం కల్పించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం అపాయింట్ మెంట్ ఇప్పించాలని బహిరంగ సభలో నేతలను డొక్కా కోరిన పరిస్థితి ఉంది. తాడేపల్లి వచ్చిన ఆయన పార్టీ నేతలతో చర్చించారు. ముందుగా నేతలతో సమావేశమవుతోన్న సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, సర్వే నివేదికలు, మార్పుల విషయాన్ని నేతలతో చర్చించారు. అనంతరం పరిస్థితి, అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు, నేతలతోనే సీఎం వైఎస్ జగన్ కలుస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి మార్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారు.

ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా

నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం చర్చిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో కలసి క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన సిద్ధార్థరెడ్డి ఆయనకే సీటు ఇవ్వాలని, తనకూ శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ సీటుపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై సీఎం కసరత్తు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డికి పిలుపు వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇరువురితో సీఎం చర్చించారు. విజయనగరం పార్లమెంట్ ఇన్చార్జి నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తో సీఎం భేటీ అయ్యారు. సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు.

డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పిలిపించిన సీఎం సీటు మార్పుపై ఆయనతో చర్చించారు. తిరుపతి జిల్లా గూడూరు (ఎస్సీ) నియోజకవర్గం ఇన్ చార్జి మార్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ను పిలిపించి సీఎం జగన్ చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ (ఎస్సీ) నియోజకవర్గం వైకాపా ఇన్ చార్జి మార్పుపై కసరత్తు చేస్తున్నారు. మరోసారి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ను పిలిచి సీఎం మాట్లాడారు. మరోసారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కు వచ్చిన రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలపాలని చూస్తోన్న వైసీపీ ఈ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం ఇన్ చార్జి మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎంవో పిలుపు మేరకు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరిన మంత్రి కొట్టు సత్యనారాయణతో చర్చించారు. కృష్ణా జిల్లాలో పెనమలూరు, పామర్రు ఇన్ చార్జి మార్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్థసారథి, కైలే అనిల్ లను తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు పిలిపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ సీఎం వద్దకు తీసుకువచ్చారు. తనకు సీఎం జగన్ సరైన గౌరవం ఇవ్వలేదని ఇటీవలే బహిరంగంగా పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెంది, సీనియర్ నైన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల మార్పుపై పార్థసారథి, కైలె అనిల్​తో సజ్జల, ధనుంజయరెడ్డి సైతం మాట్లాడినట్లు తెలిసింది. వచ్చిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు మాత్రమే తమ సీటు విషయమై సీఎంను కలసి చర్చించారు. చాలా మంది సజ్జల, ధనుంజయ్ రెడ్డి సహా సంబంధిత రీజినల్ ఇన్ చార్జిలతో మాట్లాడారు.

కొలిక్కి వచ్చిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల కసరత్తు - కాసేపట్లో రెండో జాబితా

Last Updated :Jan 8, 2024, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.