ETV Bharat / bharat

ఆమెకు గర్భం.. యువకుడిపై రేప్ కేసు.. బలవంతంగా పెళ్లి.. బిడ్డకు ఐదేళ్ల తర్వాత DNA టెస్ట్ చేస్తే..

author img

By

Published : Dec 3, 2022, 3:56 PM IST

మైనర్​పై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడని ఓ యువకుడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థుల బలవంతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం యువకుడు కోర్టును ఆశ్రయించగా.. డీఎన్​ఏ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆ పరీక్షల్లో యువతి గర్భం దాల్చడానికి ఆ యువకుడు కారణం కాదని తేలింది.

Youth carrying false rape
రేప్ కేసు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఓ యువకుడు.. డీఎన్​ఏ టెస్ట్​ కారణంగా ఐదేళ్లకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ ఘటన బంగాల్​లోని పశ్చిమ మేదినీపుర్​లో జరిగింది.
ఇదీ జరిగింది.. కేశ్‌పుర్‌ చెందిన 13 ఏళ్ల బాలిక ఐదేళ్ల క్రితం పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. ఇంటి పక్కన ఉన్న యువకుడే ఇందుకు కారణమని.. బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ పెట్టారు. తాను తప్పు చేయలేదని ఆ యువకుడు చెప్పినా ఎవరూ అతడి మాట నమ్మలేదు. బాధిత యువతిని పెళ్లి చేసుకోవాల్సిందిగా గ్రామ పెద్దలు తీర్మానించారు. వారి ఒత్తిడితో 22 ఏళ్ల యువకుడు.. మైనర్​కు 18 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకున్నాడు.

ఆమెను పెళ్లి చేసుకున్న అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ యువకుడు. తాను ఏ తప్పు చేయలేదంటూ 2017లో మేదినీపుర్ జిల్లా​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. ఆమె గర్భానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించాడు. డీఎన్​ఏ పరీక్ష చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన బిడ్డకు, ఆ యువకుడికి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. బాలికకు జన్మించిన చిన్నారికి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది.

యువకుడిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు యువతి, ఆమె తల్లిని అరెస్ట్​ చేయాల్సిందిగా పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట పోలీసులు ఆ యువతిని అరెస్ట్​ చేయలేదు. దీంతో యువకుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వారిద్దరినీ అరెస్ట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.