ETV Bharat / bharat

బాలికకు తాళి కట్టిన యువకుడు.. వీడియో వైరల్!​

author img

By

Published : Mar 20, 2021, 2:22 PM IST

పాఠశాల విద్యార్థినికి తాళి కట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మూడుముళ్లు వేసే సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన క్రమంలో చర్యలు చేపట్టారు. విద్యార్థినిని ఊటిలోని బాలికల సంక్షేమ గృహానికి తరలించారు.

Youth arrested after viral video, who ties knot with mangalya to school girl
బాలిక మెడకు తాళి.. యువకుడు చేతికి సంకెళ్లు

పాఠశాల విద్యార్థినికి ఓ యువకుడు తాళి కట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం బాలికకు పసుపుతాడు కడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఓ ఆలయం వెనకకు తీసుకెళ్లి తాళి కడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అది చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ ఘటనపై ఊటికి చెందిన సాంఘీక సంక్షేమ శాఖ విభాగం.. కూనూర్​ మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

బాలిక మెడకు తాళి.. యువకుడు చేతికి సంకెళ్లు
Youth arrested after viral video, who ties knot with mangalya to school girl
నిందితుడు

ఈ కేసును పోలీసులతో పాటు చైల్డ్​ హెల్ప్​లైన్​ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలో ఉన్న యువకుడిని సుత్తోన్​ ఎస్టేట్​ ప్రాంతానికి చెందిన గౌతమ్​గా గుర్తించారు. నిందితుడు కోయంబత్తూర్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడని వివరించారు. బాలిక తన తండ్రితో నమ్మక్కల్​లో ఉంటారని పేర్కొన్నారు.

బాల్య వివాహాల నిరోధక చట్టం కింద యువకుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. బాలికను ఊటిలోని బాలికల సంక్షేమగృహానికి తరలించారు.

ఇదీ చూడండి: వాజేకు తెల్లకుర్తా వేసి ఎన్​ఐఏ సీన్​ రీక్రియేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.