ETV Bharat / bharat

Youngest Organ Donor : పుట్టిన 4రోజులకే అవయవ దానం.. నలుగురి జీవితాల్లో వెలుగు.. అత్యంత పిన్న ఆర్గాన్​ డోనర్​గా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 8:27 AM IST

Youngest Organ Donor In India : పుట్టుకతోనే బ్రెయిన్​ డెడ్​ చిన్నారి.. మరో నలుగురి నవజాత శిశువుల జీవితాల్లో వెలుగులు నింపింది. నాలుగు రోజుల ఆ చిన్నారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేయడం వల్ల.. దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్​ డోనర్​గా నిలిచింది.

Youngest Organ Donor In India
Youngest Organ Donor In India

Youngest Organ Donor In India : దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్​ డోనర్​గా నిలిచింది గుజరాత్​ సూరత్​కు చెందిన చిన్నారి. పుట్టుకతోనే బ్రెయిన్​ డెడ్​ అయిన నాలుగు రోజుల చిన్నారి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. ఈ విషయాన్ని ఎన్జీవో జీవన్‌దీప్ అవయవదాన ఫౌండేషన్ తెలిపింది.

సూరత్​ నగరానికి చెందిన అనుప్ ఠాకూర్​ భార్య వందన.. అక్టోబరు 23న సాయంత్రం ప్రసవించింది. అయితే నవజాత శిశువు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. 48 గంటలపాటు అబ్జర్వేషన్​లో ఉంచిన వైద్యులు.. న్యూరో సర్జన్​కు రిఫర్​ చేశారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన నవజాత శిశువు.. బ్రెయిన్ డెడ్​గా న్యూరో సర్జన్​ ధ్రువీకరించారు.

ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దీప్ అవయవదాన ఫౌండేషన్ ట్రస్టీ విపుల్ తలావియా ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారి కుటుంబసభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. అక్టోబరు 18వ తేదీన ఐదు రోజుల చిన్నారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేసిన విషయాన్ని వివరించారు. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు.. అవయవదానానికి అంగీకరించారు. అనంతరం అవయవదాన ఫౌండేషన్ సభ్యులు.. చిన్నారి రెండు కిడ్నీలు, కళ్లుతో పాటు గుండె కింద ఉండే ప్లీహాన్ని సేకరించారు.

మనవడికి కిడ్నీ దానం చేసిన బామ్మ
కొన్ని నెలల క్రితం.. అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ప్రాణాలు కాపాడింది 73 ఏళ్ల బామ్మ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మనవడిని చూడలేని ఆ వృద్ధురాలు.. తన కిడ్నీనే ఇచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. యువకుడికి విజయవంతంగా ఆపరేషన్​ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు.

బెళగావి జిల్లాలోని హరుగేరి ప్రాంతానికి చెందిన సచిన్​(21) అనే యువకుడు 18 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతడి కిడ్నీ ఒకటి పూర్తిగా ఫెయిలైంది. దీంతో వారానికి రెండు సార్లు.. సచిన్ డయాలసిస్​ చేసుకోవాల్సి వచ్చేది. తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల.. వారి కిడ్నీలను అతడికి అమర్చేందుకు వీలు కాలేదు. దీంతో సచిన్​ పడుతున్న బాధను చూడలేని బామ్మ.. మనవడికి తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏడు పదుల వయస్సులోనూ కిడ్నీ దానం చేసింది. రవీంద్ర మద్రాకి అనే డాక్టర్ ఈ ఆపరేషన్​కు నేతృత్వం వహించారు. ఈ వయస్సులోనూ కిడ్నీ దానం చేసిన వృద్ధురాలిని వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది.

అరుదైన అవయవదానం.. టీనేజర్​కు 52 ఏళ్ల మహిళ చేతులు ట్రాన్స్​ప్లాంట్​

నాగ్​పుర్​ టు పుణె.. ఫ్లైట్​లో బ్రెయిన్​ డెడ్​ వ్యక్తి 'గుండె' తరలింపు.. గంటల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.