ETV Bharat / bharat

ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతులు.. కంటిలో నుంచి పురుగులు.. ఒక్కసారిగా షాక్!

author img

By

Published : Apr 1, 2023, 2:58 PM IST

worms from eyes
worms from eyes

ఉల్లిపాయలు కోయడానికి పొలానికి వెళ్లిన వ్యవసాయ కూలీలకు వింత సమస్య ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వారి కళ్ల నుంచి పురుగులు, గుడ్లు రావడం మొదలైయ్యాయి. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే?

మహారాష్ట్రలోని వింత ఘటన జరిగింది. ఉల్లిపాయలు కోయడానికి వెళ్లిన కొందరు వ్యవసాయ కూలీల కళ్ల నుంచి చిన్న చిన్న పురుగులు వచ్చాయి. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. దాదాపు 15 మంది కూలీలు ఈ వింత సమస్యతో ఆస్పత్రిలో చేరారు.
అహ్మద్​నగర్​ జిల్లాలోని రాహురి ప్రాంతంలోని వాలన్ గ్రామానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలకు ఉల్లి పంటను కోసేందుకు పొలంలోకి వెళ్లారు. అయితే వారు పొలంలో ఉల్లిపాయలు కోస్తుండగా.. వారి కళ్లలో ఏదో పడినట్లు అనిపించింది. అనంతరం వారందరికీ ఒక్కసారిగా కళ్లలో మంటలు వచ్చాయి. వెంటనే వారు దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఉన్న డాక్టర్ వారికి కొన్ని మందులిచ్చి ఇంటికి పంపించారు. అయితే ఇంటికి చేరుకున్న వారందరికీ అదే రోజు రాత్రి సమయంలో మళ్లీ కళ్లలో మంటలు మొదలయ్యాయి. వెంటనే వారిలో కొందరు రాహురిలో ఉన్న ఓ కంటి ఆస్పత్రికి వెళ్లగా.. మరికొందరు వ్యవసాయ కూలీలు అహ్మద్​నగర్​లోని జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అయితే వారి కంటిని పరీక్షించిన వైద్యులు..​ వారి కళ్లలో నుంచి పురుగులు, వాటి గుడ్లు వస్తున్నట్లు గమనించారు. దీంతో ఆ కూలీలంతా భయాందోళనకు గురయ్యారు. కంటి పరీక్షకు సంబంధించి పూర్తి నివేదికలు వెలువడిన తర్వాత వారి ఆరోగ్య సమస్య గురించి కచ్చితంగా వెల్లడించగలమని వైద్యులు తెలిపారు.

కంటిలోనుంచి రాళ్లు..!
కర్ణాటకలోని మైసూరులో మహిళ కంటిలో నుంచి రాళ్లు బయటకు వచ్చాయి. బెంకిపురా గ్రామానికి చెందిన విజయ(35) అనే మహిళ కంటి నుంచి రాళ్లు వస్తున్నాయి. పరీక్షల్లో విజయకు కంటి సమస్య ఉన్నట్లు గుర్తించారు. మొదటగా విజయకు తల నొప్పి వచ్చింది.. ఆ తర్వాత తలపై నుంచి ఏదో దొర్లినట్లుగా అనిపించింది. అనంతరం కంటిలో నుంచి నీళ్లతో పాటు రాళ్లు పడ్డాయి. దాదాపు వారం రోజుల్లోనే 200కు పైగా రాళ్లు ఆమె కంటిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ సమయంలో ఆమెకు కంటిలో నొప్పి వస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె గ్రామస్థులకు చెప్పగా.. తాను అబద్ధం చెబుతుందని అనుకున్నారు. విషయం తెలుసుకున్న బెంకిపురా గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. విజయ కంటిని పరీక్షించిన వైద్యులకు కూడా.. కంటి నుంచి రాళ్లు రావడానికి గల కచ్చితమైన కారణాలు తెలియలేదు. దీనిపై వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయకు కంటి పరీక్షలు చేసిన వైద్యులు.. చిన్నతనంలో మట్టిని తింటే ఇలా కళ్లలో నుంచి రాళ్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కానీ, విజయ అలా మట్టిని తినలేదని చెబుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.