ETV Bharat / bharat

లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చెప్పు దెబ్బలు కొట్టిన మహిళా సిబ్బంది

author img

By

Published : Apr 16, 2022, 4:15 PM IST

women staff beaten lecturer: మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కీచక లెక్చరర్​ను.. సిబ్బంది చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని ఓ కళాశాలలో జరిగింది.

women staff beaten lecturer
మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్​కు దేహశుద్ధి

మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్​కు దేహశుద్ధి

women staff beaten lecturer: అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్‌ను మహిళా సిబ్బంది చితక్కొట్టారు. కాళ్లతో తన్నారు. కర్రలతో బాదారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి ప్రభుత్వ సర్దార్ పీయూ కళాశాలలో జరిగింది. ఇంగ్లిష్ విభాగంలో లెక్చరర్​గా పనిచేస్తున్నాడు అమిత్ బసవమూర్తి. నిత్యం మద్యం సేవిస్తూ కాలేజీకి వెళ్లేవాడు. సహోద్యోగులు, సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తోటి లెక్చరర్​లను కూడా పరుష పదజాలంతో దూషించేవాడు. మహిళా సిబ్బంది రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు.

దీనిపై కళాశాల మహిళా సిబ్బంది.. ప్రిన్సిపల్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విసిగిపోయిన మహిళా సిబ్బంది బసవమూర్తిని కాలితో తన్ని, కర్రతో చితకబాదారు. చెప్పులతో దేహశుద్ధి చేశారు. అలాగే నిందితుడిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. లెక్చరర్‌ని తోటి మహిళా సిబ్బంది చితక్కొటిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి: టిఫిన్​లో ఉప్పు ఎక్కువైందని.. భార్య గొంతు నులిమి చంపిన భర్త

108 అడుగుల హనుమాన్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.