పట్టపగలే యువతిపై అఘాయిత్యం.. నడిరోడ్డుపైనే అలా...

author img

By

Published : Mar 13, 2022, 8:48 PM IST

Woman Gang raped

Women Gangrape: మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుచూసింది. పట్టపగలే ఓ యువతిపై కొందరు కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అలీరాజ్​పుర్​లో ఓ జాతరకు హాజరై తిరుగు పయణంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ కిరాతుకులు. రాజస్థాన్​లోనూ ఇటువంటి ఘటన వెలుగుచూసింది. ఓ వివాహితపై ఐదుగురు కామాంధులు సాముూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Women Gangraped: పట్టపగలే రెచ్చిపోయారు కొందరు కామాంధులు. నడిరోడ్డుపై ఓ యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ క్రూరమైన ఘటన మధ్యప్రదేశ్​లోని అలీరాజ్​పుర్ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది

జిల్లాలోని భగోరియా గిరిజన జాతర ఈ నెల 11న ప్రారంభమైంది. ఆ జాతరను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని ఇంటికి ఇళ్లకు వెళ్తుండగా.. నడిరోడ్డుపై పట్టపగలే ఓ యువతిపై కొందరు ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారిని ఎదురించేందుకు బాధితురాలు అన్ని విధాల తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమెను ఈడ్చుకెళ్లారు ఆ కిరాతుకులు.

నడిరోడ్డుపై యువతిపై అఘాయిత్యం

మానవత్వం మరిచారా?

ఇంత దారుణమైన ఘటన జరుగుతుంటే వేడుక తిలకించినట్లు ఉన్నారే తప్పా ఏ ఒక్కరూ.. ఆమెను కాపాడేందుకు ముందుకురాలేదు. మానవత్వం మరిచిపోయారా అన్నట్లు .. తమ మొబైల్​ ఫోన్లలో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేసి సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేశారు.

ఐదుగురు అరెస్ట్​

దీంతో ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీడియో తీసి.. వైరల్​ చేసినందుకు మరో ఇద్దరిని నిర్భందించారు. బాధితురాలిపై వేధింపులకు పాల్పడి.. ఇతర నిందితులను ప్రేరేపించిన మరో ముగ్గురు, నలుగురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

కాంగ్రెస్​ విమర్శలు

ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్​.. భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. 'రాష్ట్రంలో 'సేవ్​ డాటర్​ క్యాంపెయిన్​' ఇలా జరుగుతోందా? ప్రభుత్వం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోదా?' అని సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రాలను ప్రశ్నిస్తూ రాష్ట్ర కాంగ్రెస్​ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ట్వీట్ చేశారు.

రాజస్థాన్​లో మరో ఘటన

మరోవైపు, రాజస్థాన్​లోని అజ్మీర్ జిల్లాలో 22 ఏళ్ల వివాహితపై ఐదుగురు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నసీరాబాద్​ సదర్​ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను బ్లాక్​మెయిల్​ చేసేందుకు వీడియోలు తీసినట్లు ఆరోపించింది. ఈ మేరుకు ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి: తిండి లేకుండా.. 'సోలార్ ఎనర్జీ'తో పాతికేళ్లు బతికిన వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.