ETV Bharat / bharat

స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి...

author img

By

Published : Jan 16, 2022, 7:40 PM IST

Woman gang raped by husband: కట్టుకున్న భర్తే ఆ మహిళ పాలిట కాలకేయుడయ్యాడు. స్నేహితులతో కలిసి చిత్రహింసలు పెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నెలల పాటు ఆమెను ఓ ఫాంహౌజ్​లో బందీని చేశాడు.

woman gang raped by husband
woman gang raped by husband

Woman gang raped by husband: మధ్యప్రదేశ్​లో అమానుషం చోటు చేసుకుంది. ఓ మహిళపై కట్టుకున్న భర్తే.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ శరీరంపై సిగరెట్లతో వాతలు పెట్టాడు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Woman tortured by husband:

షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌజ్​లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ.. ఎఫ్ఐఆర్​లో పేర్కొంది. తన భర్త తీవ్రంగా హింసించాడని తెలిపింది. అతడి స్నేహితులు అసహజ శృంగారం చేశారని వెల్లడించింది. రహస్య భాగాల్లో సిగరెట్లతో కాల్చారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సహకరించకపోతే చంపేస్తామని బెదిరించారని పేర్కొంది.

Madhya Pradesh Crime news

బాధితురాలి స్వరాష్ట్రం ఛత్తీస్​గఢ్ అని పోలీసులు తెలిపారు. ఓ మ్యాట్రిమోనీ సైట్​లో చూసి ఇందోర్​లో నివసించే వ్యక్తిని వివాహమాడిందని చెప్పారు. అయితే, అతడికి అప్పటికే పెళ్లి అయిందని వివరించారు. 'ఫాంహౌజ్​లో బందీగా ఉన్న మహిళ.. ఎలాగోలా తప్పించుకొని ఛత్తీస్​గఢ్​లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నిందితులు ఆమె వెంటపడి చంపేస్తామని బెదిరించారు' అని పోలీసులు చెప్పారు.

బాధితురాలి భర్త సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి: రూబెల్లా టీకా తీసుకొని ముగ్గురు శిశువులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.