ETV Bharat / bharat

Woman Fake Gang Rape: ప్రియుడి కోసం యువతి గ్యాంగ్​ రేప్ నాటకం

author img

By

Published : Dec 14, 2021, 12:27 PM IST

woman fake gang rape: బాయ్​ఫ్రెండ్​ను వివాహం చేసుకోవడం కోసం ఓ యువతి అల్లిన కట్టుకథ​ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత యువతిని ప్రశ్నించగా.. అసలు విషయం ఒప్పుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

woman fake gang rape story
నాగ్​పుర్​ యువతి గ్యాంగ్​రేప్ కట్టుకథ

Woman Fake Gang Rape: ప్రియుడిని వివాహం చేసుకోవడానికి ఓ యువతి గ్యాంగ్​రేప్ కట్టుకథ అల్లింది. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

Nagpur Women Fake Gang Rape Story:

చిఖ్కాలీ ప్రాంతంలో తనను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని సోమవారం ఉదయం 11 గంటలకు సీతాబుల్దీ పోలీస్​ స్టేషన్​లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ క్లాస్​కు వెళ్లి తిరిగి వస్తుండగా రహదారి సమాచారం అడిగిన వ్యాన్ డ్రైవర్లు.. తనను నిర్బంధించి చిఖ్కాలీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. సున్నితమైన విషయం కావడం వల్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే 40 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. కమిషనర్ అమితేష్ కుమార్​, అడిషనల్​ సీపీ సునిల్ ఫులారీతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 1,000 మంది పోలీసులు నగరంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసులో 50 మందిని ప్రశ్నించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి యువతిని ప్రశ్నించారు. దీంతో బాయ్​ఫ్రెండ్​ని పెళ్లి చేసుకోవడానికే డ్రామా ఆడినట్లు యువతి ఒప్పుకుంది.

ఇదీ చదవండి: Girl burnt alive from lamp: దీపం వెలిగిస్తుండగా.. యువతి సజీవదహనం

బలవంతంగా శృంగారానికి ప్రయత్నం.. భర్త అంగం కోసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.