ETV Bharat / bharat

'నా భార్య ఆడది కాదు.. నేను మోసపోయా.. న్యాయం చేయండి'

author img

By

Published : Mar 14, 2022, 12:03 PM IST

Updated : Mar 14, 2022, 3:38 PM IST

Wife Is Not Female: 'నా భార్య ఆడది కాదు.. నేను మోసపోయా' అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి. ఆమె పుట్టుకతో ఆడదే అయినా.. బాహ్య పురుష జననాంగం కూడా ఉన్నట్లు వైద్య నివేదికలో వెల్లడైంది.

Wife Is Not Female
నా భార్య ఆడది కాదు

Wife Is Not Female: "నా భార్యకు బాహ్య పురుష జననేంద్రియాలు ఉన్నాయి. ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు. నేను మోసపోయాను. నాకు న్యాయం చేయండి"అంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన ఓ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 'ఆమె పుట్టుకతో ఆడదే. అండాశయం ఉంది. అయితే, అవిచ్ఛిన్నమైన కన్నెపొరకు తోడు బాహ్య పురుష జననాంగం కూడా ఉంది' అని వైద్య నివేదిక చెబుతోంది.

స్త్రీ, పురుష సంబంధాలకు సవాలు విసిరేలాంటి ఈ విచిత్రమైన కేసు గత శుక్రవారం తన ముంగిటకు రావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణకు తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ, వైద్య నివేదికను పరిశీలించిన తర్వాత ఆ మహిళకు నోటీసు పంపాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ దంపతులకు 2016లో పెళ్లయింది. సంసార జీవితానికి మొదట్లో కొన్నిరోజులు ఆవిడ నిరాకరిస్తూ వచ్చింది. తీరా ఒప్పుకొన్నాక ఆమెలో పురుష లక్షణాలున్న విషయం బయటపడి భర్త అవాక్కయ్యాడు. వెంటనే వైద్యపరీక్ష చేయించాడు. ఆమెకు 'కంజెనిటల్‌ అడ్రినల్‌ హైపర్‌ప్లాసియా' అనే జన్యుపరమైన రుగ్మత ఉన్నట్లు తేలింది. దీనిప్రకారం తన బాహ్య జననేంద్రియాలు బాలుడికి లాగా ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా మార్పు చేయించుకోవచ్చని కూడా వైద్యుడు సూచించారు. ఈ విషయం తనకు చెప్పకుండా పెళ్లి చేశారంటూ భర్త ఆమెను పుట్టింటికి పంపేయడం వల్ల రెండు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయితీలు నడిచాయి. పరస్పరం పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు.

ఆమెతో వైవాహిక జీవితం కష్టమని, సంతానోత్పత్తి కూడా సాధ్యం కాదని ట్రయల్‌ కోర్టులో వైద్యుడు నివేదిక ఇచ్చాడు. కోర్టు ఆదేశానుసారం తాజా వైద్యపరీక్షకు వెళ్లేందుకు ఆమె నిరాకరిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఆమెలో మహిళకు ఉండాల్సిన లక్షణాలు, అవయవాలు అన్నీ ఉన్నందున.. ఇందులో మోసం ఏదీ లేదంటూ అక్కడ తీర్పు వెలువడింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌ల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

ఇదీ చూడండి: బాయ్స్​ హాస్టల్​లో కీచక వార్డెన్.. 10మంది విద్యార్థులపై అలా..!

Last Updated :Mar 14, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.