ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (జూన్‌ 26 - జులై 02 )

author img

By

Published : Jun 26, 2022, 5:07 AM IST

Weekly Horoscope: ఈ వారం (జూన్​ 26 -​ జులై 02) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

Weekly Horoscope
ఈ వారం రాశి ఫలాలు

.

ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కన్పిస్తుంది. ధర్మమార్గాన్ని వదలవద్దు. వ్యాపారలాభం విశేషం. అదృష్టం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఆటంకాలున్నా విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పని పూర్తవుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.

.

ఉత్తమకాలం నడుస్తోంది. అన్నింటా అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో పనిచేయండి. అదృష్టవంతులు అవుతారు. భూ, గృహ లాభాలున్నాయి. సంపద పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం మిశ్రమం. నిరంతర కృషి మేలుచేస్తుంది. సూర్యారాధన శ్రేష్ఠం.

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆపదలు పొంచివున్నాయి. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సమష్టి నిర్ణయాలు మంచిది. చంచలత్వం, మొహమాటం ఇబ్బందిపెడతాయి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నిందలు మోపే వారుంటారు. ఆచితూచి సంభాషించండి. నవగ్రహశ్లోకాలు చదివితే అభీష్టసిద్ధి ఉంటుంది.

.

కాలం సహకరిస్తోంది. విశేషమైన ధనలాభం సూచితం. అదృష్టయోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. పదిమందికీ ఉపయోగపడే పనులు చేయండి. ధర్మం సదా రక్షిస్తుంది. వ్యాపారబలం అద్భుతంగా ఉంది. నూతన కార్యాల్లో పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు శ్రేయోదాయకంగా గోచరిస్తోంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

.

ఉద్యోగం శుభప్రదం. ముఖ్యకార్యాల్లో లాభం ఉంటుంది. కోరికలు నెరవేరతాయి. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కొన్ని సత్కార్యాలను సాధించే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదేవతాధ్యానం శక్తినిస్తుంది.

.

కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. అధికార బలం ఉంది. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. వ్యాపారం అనుకూలం. వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబపరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టు సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. బుద్ధిబలంతో అధిగమించాలి. ముఖ్యకార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. సత్యనిష్ఠ ముందుకు నడిపిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది.

.

తెలియని ఆటంకాలున్నాయి. ఏకాగ్రత అవసరం. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమష్టి కృషితో ఉత్తమఫలితం సాధించవచ్చు. ఉద్యోగంలో ఓర్పు అవసరం. దేనికీ తొందర వద్దు. ఉపద్రవాలు తొలగుతాయి. ఇంట్లోవారి సహకారంతో అదృష్టవంతులు అవుతారు. సూర్యాష్టోత్తరం చదివితే మేలు.

.

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించే కాలం. చిన్న ప్రయత్నంతోనే అధికలాభం పొందుతారు. సంఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడాలి. మనోబలం అవసరం. ఒక పనిలో విజయం ఉంటుంది. నమ్మకంగా ముందుకెళ్తే ఆశయం నెరవేరుతుంది. దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తే మంచిది.

.

ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితముంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం సూచితం. ఇంట్లోవారికి మేలు జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

.

వ్యాపారయోగం అద్భుతం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధనలాభముంటుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఏర్పడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచే వారున్నారు. ఏకాగ్రత చాలా అవసరం. బాధ్యతలు పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

.

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి, కష్టాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఇబ్బంది ఎదురవుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఫలితం మందకొడిగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వేంకటేశ్వరస్వామిని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.