ETV Bharat / bharat

'జిల్లాకో మెడికల్​ కాలేజీ మా లక్ష్యం'

author img

By

Published : May 31, 2022, 1:30 PM IST

Updated : May 31, 2022, 2:36 PM IST

pm modi news: తాను ప్రధానిని కానని.. 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడినని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 8ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా శిమ్లాలో నిర్వహించిన గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​లో ప్రధాని మోదీ ప్రసంగిచారు. అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు సుమారు 21 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

pm modi news
pm modi news

pm modi news: దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మెడికల్​ కాలేజీ నిర్మించాలనేది తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో పేదరికం తగ్గుతుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. దేశ సరిహద్దులు 2014 ముందు కన్నా సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. భాజపా 8ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో నిర్వహించిన గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​లో ప్రధాని మోదీ ప్రసంగిచారు.

గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా తనను తాను ప్రధానమంత్రిగా ఊహించుకోలేదన్నారు నరేంద్ర మోదీ. తాను ప్రధానిని కానని.. 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడినని ఉద్ఘాటించారు. ఫైల్స్​పై సంతకాలు చేసినప్పుడే ప్రధాని హోదాలో ఉంటానని తెలిపారు. అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు సుమారు 21 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

2014కు ముందు అవినీతి ప్రభుత్వంలో భాగమైపోయిందని.. భాజపా ప్రభుత్వం దానిని జీరో శాతానికి తీసుకువచ్చిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతి జరిగే ఆస్కారం లేకుండా చేశామని చెప్పారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని ధ్వంసం చేశాయని.. తాము ఓట్ల కోసం కాక.. నవభారత నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. ఇప్పటివరకు సుమారు 200 కోట్ల కొవిడ్​ టీకాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేశామని.. టీకాల ఉత్పత్తిలో హిమాచల్​ ప్రదేశ్​లోని బడ్డీ పారిశ్రామిక ప్రాంతం కీలక పాత్ర పోషించందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భాజపాలోకి హార్దిక్ పటేల్.. ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్​కు ఇక కష్టమే!

Last Updated : May 31, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.