ETV Bharat / bharat

జిమ్​లో సీఎం వర్క్​అవుట్లు.. వీడియో వైరల్​

author img

By

Published : Aug 21, 2021, 4:23 PM IST

ఓ ముఖ్యమంత్రి జిమ్​లో వర్క్​అవుట్లు చేయడం ఎప్పుడైనా చూశారా? ఆ అవకాశం కల్పించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఆయన జిమ్​లో వర్క్​అవుట్లు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

MK Stalin
ఎంకే స్టాలిన్

జిమ్​లో తమిళనాడు సీఎం స్టాలిన్ వర్క్​అవుట్లు

జిమ్​లో కసరత్తులు చేస్తూ కనిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. బిజీ షెడ్యూల్​లోనూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న స్టాలిన్.. వీకెండ్​లో​ తన వ్యక్తిగత జిమ్​లో వర్క్​అవుట్లు చేశారు.

68ఏళ్ల స్టాలిన్​ జిమ్​లో వ్యాయామం చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

g
వర్క్​అవుట్లు చేస్తున్న స్టాలిన్

సైక్లింగ్ కూడా..

వ్యాయామం పట్ల స్టాలిన్​కు ఉన్న శ్రద్ధ అందరికి తెలిసిన విషయమే. గతంలోనూ అనేక సార్లు రోడ్లపై సైక్లింగ్​ చేస్తూ కనిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆ అలవాట్లను మానుకోలేదు స్టాలిన్​. చెన్నై ఈసీఆర్​ ప్రాంతంలో సైకిల్​పై చక్కర్లు కొట్టి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.

ఇదీ చూడండి: సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.