ETV Bharat / bharat

రూ.1.5 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్​.. ATMలో నింపేందుకు వచ్చి చోరీ..

author img

By

Published : Apr 11, 2023, 1:35 PM IST

Updated : Apr 11, 2023, 2:35 PM IST

రూ.1.5 కోట్ల​ సొమ్మును ఎత్తుకెళ్లాడు ఓ వ్యాన్ డ్రైవర్​. ఓ బ్యాంక్​కు చెందిన సొమ్మును ఏటీఎమ్​లో నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ సంస్థ డ్రైవర్​ నగదుతో సహా పారిపోయాడు. ఈ ఘటన బిహార్​ రాజధాని పట్నాలో జరిగింది.

van driver theft one and half crore in bihar
రూ.1.5 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్

ఐసీఐసీఐ బ్యాంక్​కు చెందిన.. రూ.1.5 కోట్ల​ సొమ్మును ఎత్తుకెళ్లాడు ఓ సెక్యూరిటీ సంస్థ వ్యాన్​ డ్రైవర్​. డబ్బును ఏటీఎమ్​లో నింపేందుకు వచ్చి.. వ్యాన్​తో సహా పరారయ్యాడు. తోటి సిబ్బంది కళ్లుగప్పి కోటిన్నర రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బిహార్​ రాజధాని పట్నాలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన జరిగింది. సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీకి చెందిన సిబ్బంది.. ఐసీఐసీఐ ఏటీఎమ్​లో నగదు నింపేందుకు వచ్చారు. వ్యాన్​లో రూ. 1.5 కోట్లతో డంకా ఎమ్లీ గోలంబార్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌కి చేరుకున్నారు. ఆ సమయంలో వ్యాన్​లో ఓ గన్​మెన్​, సంస్థ ఆడిటర్​, డ్రైవర్​ ఉన్నారు. ఆడిటర్, గన్​మెన్​​ వాహనం​ దిగి కాస్తా దూరం వెళ్లగానే.. వ్యాన్​తో పాటు ఉడాయించాడు డ్రైవర్​. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఆడిటర్.

అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్​ను సురజ్​ కుమార్​గా గుర్తించారు. ప్రస్తుతం ఆడిటర్​, గన్​మెన్​.. పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎత్తుకెళ్లిన వ్యాన్​ జీపీఎస్​ లొకేషన్​ ఆధారంగా గుర్తించారు పోలీసులు. అనంతరం అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎన్​ఎమ్​సీఎచ్​ రోడ్డు పక్కన వ్యాన్ నిలిపాడని.. అనంతరం వాహనంలో ఉన్న డబ్బును తీసుకుని కారులో పారిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు​ ఇంకా పరారీలోనే ఉన్నాడని వారు వెల్లడించారు.

సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీ కార్యాలయం అగంకువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్​నాథ్ రోడ్​లో ఉంది. నిందితుడు​ గత సంవత్సన్నర కాలం నుంచి కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడు దౌలత్‌పూర్​కు చెందిన వ్యక్తి కాగా.. ప్రస్తుతం జహనాబాద్‌లోని ఘసి పోలీస్ స్టేషన్ పరిధిలో నినాసం ఉంటున్నాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపిన పోలీసులు.. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఏటీఎం వ్యాన్​ డ్రైవర్​ ఉడాయింపు.. వాహనంలో ఎన్ని లక్షలున్నాయంటే..!
ఆంధ్రప్రదేశ్​లోని వివిధ జాతీయ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం మిషన్లలో నిల్వచేసే లక్షల రూపాయల నగదు ఉన్న వాహనంతో పరారయ్యాడు ఓ డ్రైవర్. కడపకు చెందిన షారుఖ్​ అనే వ్యక్తి ఈ చోరికి పాల్పడ్డాడు. దాదాపు 80 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు. కడప ఐటీఐ కూడలి వద్దనున్న ఎస్బీఐ ఏటీఎంలో సిబ్బంది కొంత నగదు పెడుతుండగా.. సెక్యూరిటీ గార్డు ఏటీఎం కేంద్రం వద్ద కాపలా ఉన్నాడు. ఇదే అదునుగా చూసిన డ్రైవర్ షారుఖ్ వాహనంతో ఉడాయించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఇవీ చదవండి:

Last Updated :Apr 11, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.