ETV Bharat / bharat

దేవభూమిలో ఎన్నికలకు సర్వం సిద్ధం

author img

By

Published : Feb 13, 2022, 4:34 PM IST

Updated : Feb 13, 2022, 5:57 PM IST

uttarakhand election 2022
ఎన్నికలకు సిద్ధమైన దేవభూమి

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్​ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. కొవిడ్-19 దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

Uttarakhand Election 2022: రాజకీయ అస్థిరతకు వేదికగా పేరుగాంచిన దేవభూమి ఉత్తరాఖండ్​లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 13 జిల్లాల్లోని 70నియోజకవర్గాలకు ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 82,38,187లక్షల మంది ఓటర్లు 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. వీరిలో 152 మంది స్వతంత్రులు.

uttarakhand election 2022
.

కొవిడ్-19 కారణంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 101 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం 6 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

uttarakhand election 2022
.

ఉత్తరాఖండ్​లో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

ఇవీ చూడండి: Uttarakhand Election 2022: ఓటరు మౌనం.. పార్టీల్లో ఉత్కంఠ!

'అధికారంలోకి వస్తే.. యూనిఫామ్ సివిల్​ కోడ్​ను అమలు చేస్తాం'

'ఐదేళ్ల సీఎం కావాలి.. స్థిరమైన ప్రభుత్వం రావాలి'

Last Updated :Feb 13, 2022, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.