ETV Bharat / bharat

'రేషన్​ తరహాలో సబ్సిడీపై గడ్డి.. గ్రామానికో షాప్​'

author img

By

Published : Oct 28, 2021, 8:35 PM IST

ఉత్తరాఖండ్​ కేబినెట్ మంత్రి ధన్​ సింగ్ రావత్​.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమ పశువుల కోసం అవసరమైన గడ్డి కోసం దుకాణాలు తెరుస్తామని, ప్రతి మహిళకు 20 కిలోల గడ్డి ప్యాక్​లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలను నెటిజన్లు తెగ ట్రోల్స్​ చేస్తున్నారు.

minister dhan singh rawat
ధన్​ సింగ్ రావత్

మహిళల కోసం గడ్డి దుకాణాలు

వివాదాస్పద వ్యాఖ్యలతో ఉత్తరాఖండ్​ కేబినెట్ మంత్రి ధన్​సింగ్ రావత్​ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో వర్షాలను మొబైల్​ యాప్ ద్వారా నియంత్రిస్తామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా మహిళల కోసం గడ్డి అందించే షాపులను నెలకొల్పుతామని చెప్పారు. ధన్​ సింగ్​ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

మంత్రి ఏమన్నారంటే..?

శ్రీనగర్​లోని ఓ గ్రామంలో నిర్వహించిన మహిళల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ.. గ్రామాల్లో ప్రభుత్వం గడ్డి షాపులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు, రేషన్​ను అందిస్తున్న తరహాలోనే ప్రతి మహిళకు 20 కిలోల గడ్డి ప్యాక్​లను అందిస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలకు ఆయన ఎదురుగా కూర్చున్న మహిళలు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

ఇది ఆయనకు కొత్త కాదు...

ధన్ ​సింగ్​ రావత్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వర్షాలను మొబైల్​ యాప్​తో నియంత్రిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో.. ఆవులు పడుకునేందుకు వాటికి పరుపులు అందిస్తామని చెప్పారు. ధన్​సింగ్ వ్యాఖ్యలను నెటిజన్లు తెగ ట్రోల్​ చేశారు. ఆయన మీద తయారు చేసిన మీమ్స్​ కూడా తెగ వైరల్ అయ్యాయి.

ఇదీ చూడండి: చెరకు కర్ర కోసం హైవేపై ఏనుగుల ఫైట్​- భారీగా ట్రాఫిక్​ జామ్​!

ఇదీ చూడండి: చనిపోయిన వారికి వివాహం.. ఇదో వింత ఆచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.