రూ.600 కోట్ల యావదాస్తి ప్రభుత్వానికి విరాళం.. ఒక్క ఇల్లు తప్ప!

author img

By

Published : Jul 22, 2022, 7:09 AM IST

arvind goyal donation
అరవింద్​ కుమార్ గోయల్ వ్యాపారవేత్త ()

రూ.600 కోట్ల ఆస్తిని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు ఓ వ్యాపారవేత్త. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని కోరారు. ఆయనే యూపీకి చెందిన అరవింద్ కుమార్ గోయల్. ఒక్క ఇల్లు మినహా తన దగ్గర ఎటువంటి ఆస్తి ఉంచుకోలేదు.

ఒక్క ఇల్లు మినహా తనకున్న మొత్తం రూ.600 కోట్ల ఆస్తిని విరాళమిచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కుమార్‌ గోయల్‌ అనే ఓ పారిశ్రామికవేత్త. పేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం తన యావదాస్తిని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు ఇటీవల గోయల్‌ ప్రకటించారు. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్‌ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. మొరాదాబాద్‌కు చెందిన గోయల్‌ అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 50 గ్రామాల ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు.

గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబసభ్యులు కూడా మద్దతిచ్చారట. ఈ సందర్భంగా అరవింద్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడారు. "నా సంపదనంతా పేదలకు విరాళంగా ఇవ్వాలని 25ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా. ఓ రోజు నేను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పేద వ్యక్తి పరిస్థితి చూసి నా మనసు చలించిపోయింది. నాకు చేతనైన సాయం చేశా. అయితే ఇలాంటి వాళ్లు దేశంలో ఎంతోమంది ఉంటారు కదా. వాళ్లకు కూడా నావంతు సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా" అని చెప్పుకొచ్చారు. సమాజం కోసం గోయల్‌ చేస్తున్న సేవలకు మెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, అబ్దుల్‌ కలాం ఆయన్ను సత్కరించారు.

ఇవీ చదవండి: ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం

ఇండిగో విమానంలో ప్యాసింజర్​ హల్​చల్​.. బ్యాగ్​లో బాంబు ఉందంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.