ETV Bharat / bharat

రూ. 11 వేలు కడితే.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే టికెట్​!

author img

By

Published : Sep 15, 2021, 11:56 AM IST

''మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే.. రూ. 11 వేలు కట్టి అప్లై చేసుకోండి.'' ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్(UP Congress news)​ చేసిన ప్రకటన. వచ్చే ఏడాది అక్కడ శాసనసభ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న నేపథ్యంలో.. పార్టీ టికెట్​ ఆశించే వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్​.

Cong asks ticket aspirants to submit Rs 11000 with application
ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు, యూపీ కాంగ్రెస్​, ప్రియాంక గాంధీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Election 2022) పోటీ చేయాలనుకునే కాంగ్రెస్​ అభ్యర్థులు.. రూ. 11 వేల కట్టి దరఖాస్తు సమర్పించాలని పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడి బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమ అవుతుందని స్పష్టం చేసింది.

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.. ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi news) నేతృత్వంలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

''రానున్న అసెంబ్లీ ఎన్నికల(UP Election 2022) కోసం.. అప్లికేషన్లను స్వీకరించే బాధ్యత సంజయ్​ శర్మ, విజయ్​ బహదూర్​ చూస్తారు. ఆశావహులు.. సెప్టెంబర్​ 25లోగా రూ. 11 వేలు కట్టి దరఖాస్తు సమర్పించాలి. ఆర్​టీజీఎస్​, డిమాండ్​ డ్రాఫ్ట్​, పే ఆర్డర్​ ద్వారా నగదు జమ చేయొచ్చు. బ్యాంకు వివరాల్ని కూడా దరఖాస్తుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటి నుంచే ప్రారంభమైంది.''

- యూపీ కాంగ్రెస్​ ప్రకటన

403 స్థానాలున్న ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీకి(UP Election 2022).. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ అతి పెద్ద రాష్ట్రంలో గెలుపు కోసం ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించాయి ఆయా పార్టీలు.

ఇవీ చూడండి: యోగి సర్కార్​పై మోదీ ప్రశంసల జల్లు

దీదీ నామినేషన్​ తిరస్కరించాలని ప్రియాంక డిమాండ్

'హిందూ మహిళతో ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చెల్లదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.