ETV Bharat / bharat

UP Coalition Politics: యూపీలో మారిన పొత్తుల సరళి.. చిన్న పార్టీలతోనే దోస్తీ ఎందుకంటే?

author img

By

Published : Dec 29, 2021, 10:28 AM IST

UP Election 2022
యూపీ ఎన్నికలు 2022

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​.. ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుంది. ఇక్కడ విజయం సాధిస్తే ఇక దిల్లీలో చక్రం తిప్పడం పెద్ద కష్టమేం కాదు!. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కులాల పరంగా ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. అయితే గతానికంటే భిన్నంగా.. ఈసారి పెద్ద పార్టీలు దోస్తీకి నిరాకరిస్తున్నాయి. ఎందుకో ఓ సారి చూద్దాం..!

UP Coalition Politics: వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. మరోవైపు రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గత రాజకీయ అనుభవాల ఆధారంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. కులాలు, ప్రాంతాల పరంగా ఓట్లను పొందే పనిలో పడ్డాయి. అయితే ఈ సారి యూపీలో గతంలో మాదిరిగా కాకుండా పొత్తుల సరళి మారింది. చిన్న పార్టీలతో పొత్తే లక్ష్యంగా.. అధికార భాజపా, ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. కానీ పెద్ద పార్టీలతో దోస్తీకి నిరాకరిస్తున్నాయి.

ఎందుకంటే..?

UP Assembly Election 2022: గత 50 ఏళ్లుగా యూపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఉండేది. 1967 నుంచి 2019 సాధారణ ఎన్నికల వరకు ఆనవాయితీగా సాగింది. అయితే ఆ సంప్రదాయానికి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో చెక్​పడింది.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు పెద్దగా ప్రజల అభిమానాన్ని పొందలేదని అభిప్రాయం ఉంది. 1967 నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో.. సంకీర్ణ ప్రభుత్వాలు విజయం సాధించాయి. అయితే అందులో మెజార్టీ ప్రభుత్వాలు ఐదేళ్ల పదవీకాలాన్ని కొనసాగించలేకపోయాయి. యూపీలో 1967లోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ లోక్ దళ్, జన్ సంఘ్​తో దోస్తీ కట్టి చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కానీ ఏడాది ముగియముందే ప్రభుత్వం కూలిపోయింది. 1977లో దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నం జరిగింది. సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకుల సొంత ప్రయోజనాల కారణంగా మరోసారి చీలిక తప్పలేదు.

1995లో ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాం సరికొత్త ఆలోచనతో ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కానీ అదే ఏడాది 'గెస్ట్​ హౌజ్ కుంభకోణం' పేరుతో ప్రభుత్వం కూలిపోక తప్పలేదు. 1996, 2002లోనూ పొత్తు ప్రయత్నాలు జరిగాయి. కానీ కొసదాక ఎవరూ కొనసాగలేదు.

ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ- కాంగ్రెస్​ కలిసి పోటీ చేసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఇలా గతంలో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన పెద్ద పార్టీలు విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ప్రధాన పార్టీలు పొత్తుకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సారు ఎవరెవరు దోస్తీ..

Contest Between BJP And SP: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రస్తుతం ప్రధానంగా అధికార భాజపా.. సమాజ్​వాదీ పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో చిన్న పార్టీలే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. చిన్నపార్టీలు తమ ప్రత్యేక వర్గాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయని ఆశిస్తున్నాయి. ఈ విధంగా వివిధ కులాల ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ లక్ష్యంతోనే పూర్వాంచల్, అవధ్ ప్రాంతాల్లో ఓం ప్రకాశ్ రాజ్​భర్ పార్టీతో జతకట్టింది సమాజ్ వాదీ పార్టీ. అధికార భాజపా ఇక్కడ అప్నా దళ్, నిషాధ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. యూపీ పశ్చిమ భాగంలో అత్యధికంగా ఉన్న జాట్​ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్పీ.. రాష్ట్రీయ లోక్ దళ్​(ఆర్​ఎల్​డీ)తో దోస్తీ కట్టింది.

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 2019 ఎన్నికల్లో పెద్ద పార్టీలతో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అసదుద్ధీన్ ఓవైసీ (ఏఐఎమ్​ఐఎమ్​)తో పొత్తు పెట్టుకుంది బీఎస్పీ. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్​ యూపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అంతగా ప్రభావం చూపలేక పోతోంది. ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవుతోంది. కాంగ్రెస్​తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: 'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'

యూపీలో పార్టీల ఎత్తులు జిత్తులు- గెలుపు వ్యూహాల్లో తలమునకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.