ETV Bharat / bharat

'గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు పదేళ్లలో రెట్టింపు'

author img

By

Published : Feb 6, 2021, 7:11 AM IST

గత పదేళ్లలో.. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు రెండింతలైనట్టు ఏడీఆర్​ సర్వేలో తేలింది. 2010లో వీటి సంఖ్య 1,112 ఉండగా.. 2019 నాటికి 2,301కి పెరిగినట్టు ఏడీఆర్​ వెల్లడించింది.

Unrecognized Political parties in the Country has doubled in last 10 years: ADR
గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు పదేళ్లలో రెట్టింపు

దేశంలో గత పదేళ్లలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీల సంఖ్య రెట్టింపైనట్టు అసోసియేషన్​ ఫర్​ డెెెమోక్రాటిక్​ రిఫార్మ్స్​(ఏడీఆర్​) ఓ నివేదికలో తెలిపింది. కొత్తగా నమోదైనవి, అసెంబ్లీ లేదా లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందడానికి తగినంత ఓట్ల శాతం పొందనివి, నమోదు చేసుకున్నా ఎన్నికల్లో పోటీ చేయనివి.. వీటన్నింటినీ కలిపి గుర్తింపు పొందని పార్టీలుగా పరిగణనలోకి తీసుకున్నట్టు ఏడీఆర్​ వెల్లడించింది.

ఇలాంటి పార్టీలు 2010లో 1,112 ఉండగా.. 2019 మార్చి నాటికి వీటి సంఖ్య 2,301కి చేరినట్టు తెలిపింది ఏడీఆర్​. 2018-19 మధ్య ఈ తరహా పార్టీలు 9.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఉత్తర్​ప్రదేశ్​లో అత్యధికంగా ఇలాంటి పార్టీలు 653 ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(291), తమిళనాడు(184)లు ఉన్నట్టు ఏడీఆర్​ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పాస్​పోర్టుకు.. సోషల్​ మీడియాకు 'లింక్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.