ETV Bharat / bharat

బంగారంతో బుల్లి ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ.. సూది బెజ్జంలో పట్టేంత సైజులో..

author img

By

Published : Dec 1, 2022, 10:44 AM IST

udaipur-iqbal-sakka-made-world-smallest-fifa-world-cup-and-artist-wrote-letter-to-pm-modi
ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్ కప్​ తయారు చేసిన ఇక్బాల్ నక్కా

ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్​ కప్​ పైనే ఉంది. దీంతో రాజస్థాన్​లో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్ కప్​ రూపొందించాడు. ఇది ఎంత చిన్నదంటే.. లెన్స్​తో చూస్తేనే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందామా..

రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో ఓ వ్యక్తి ఫిఫా ప్రపంచ కప్ కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఇక్బాల్ నక్కా అనే వ్యక్తి బంగారంతో.. ప్రపంచంలోనే అతిచిన్న వరల్డ్ కప్​ ప్రతిరూపాన్ని తయారు చేసి అరుదైన రికార్డు సాధించారు. ఆయన ఇంతకముందు కూడా తన నైపుణ్యంతో అతి చిన్న బంగారు ఆభరణాలను తయారు చేసి 100 రికార్డులను సృష్టించారు. అయితే ఈసారి ఆయన​ ఒక మిల్లీమీటర్ల పరిమాణంలో ఫిఫా వరల్డ్ కప్​ ట్రోఫీని తయారుచేసి మరో అరుదైన రికార్డును ఆయన ఖాతాలో వేసుకున్నారు.

udaipur-iqbal-sakka-made-world-smallest-fifa-world-cup-and-artist-wrote-letter-to-pm-modi
సూది రంధ్రం గుండా వెళ్లగలిగే అతి చిన్న ట్రోఫీ

"ఫిఫా వరల్డ్ కప్​లో భారత్ జట్టు పాల్గొనకపోయినా, భారత్​తోపాటు మిగతా దేశాల దృష్టంతా దానిపైనే ఉంది. అయితే ఈ ఫిఫా వరల్డ్ కప్​లో ఏ జట్టు గెలిచినా నేను తయారు చేసిన ఈ ట్రోఫీని అందజేయాలని అనుకుంటున్నాను. ఈ మేరకు భారత్​ ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశాను. నేను రూపొందించిన ట్రోఫీ పరిమాణం ఒక మిల్లీమీటర్. దీన్ని బంగారంతో తయారు చేశాను. ఈ ట్రోఫీ చాలా చిన్నది. దీన్ని లెన్స్ సహాయంతో చూడవచ్చు. బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే అతి చిన్న ఈ ట్రోఫీ కేవలం ఒక మిల్లీమీటర్ మాత్రమే. ఇది ఖచ్చితంగా నిజమైన టోఫీ లాగా కనిపిస్తుంది. టోఫీతో పాటు, మైక్రోస్కోప్ లెన్స్‌తో మాత్రమే చూడగలిగే ఫుట్​బాల్​ను కూడా నేను తయారు చేశాను. దీని పరిమాణం 0.01 మిల్లీమీటర్లు. ఇది సూది రంధ్రం గుండా సులభంగా వెళుతుంది. ఇది తయారు చేయడం అంత సులభం కాదు. దీన్ని తయారు చేసేందుకు నాకు 2 నుంచి 3 రోజులు పట్టింది. చిన్నగా ఉండడం వల్ల దీని తయారీలో చాలా సమస్యలు ఎదురయ్యాయి."
-ఇక్బాల్ నక్కా, ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్ కప్​ రూపకర్త

udaipur-iqbal-sakka-made-world-smallest-fifa-world-cup-and-artist-wrote-letter-to-pm-modi
ప్రపంచంలోనే అతి చిన్న ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.