ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు - ఇద్దరు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Feb 25, 2022, 12:43 PM IST

kashmir
encounter

Kashmir Encounter: జమ్ము కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో సైనికులు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Kashmir Encounter: జమ్ము కశ్మీర్‌లో ఎన్​కౌంటర్​ జరిగింది. షోపియాన్​ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున.. ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలోని అమ్షిపొరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

"ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని వివరాలు తర్వాత తెలుపుతాము" అని కశ్మీరీ పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 13వేల కరోనా కేసులు.. 302 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.