ETV Bharat / bharat

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన​ కూతుళ్లు

author img

By

Published : Jun 30, 2021, 11:01 PM IST

ఛత్తీస్​గఢ్​లో అమానవీయ ఘటన జరిగింది. నిత్యం తాగి వచ్చి వేధిస్తున్న తండ్రిని మైనర్​ అక్కాచెల్లెలు కలిసి గొడ్డలితో నరికి చంపారు.

alcohol ruined family
తండ్రిని చంపిన కూతుళ్లు

ఛత్తీస్​గఢ్​లో రాజనాంద్​ గావ్​ జిల్లాలో ఘోరం జరిగింది. మైనర్​ అక్కాచెల్లెలు కలిసి తండ్రిని గొడ్డలితో నరికి చంపారు. జిల్లాలోని బెలరగొండి గ్రామంలో సహదేవ్​ నేతమ్​ (45) తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వారికి 14,16 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సహదేవ్​ ఇటీవల మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్య, పిల్లలను వేధించసాగాడు.

గొడ్డలితో నరికి..

మంగళవారం రాత్రి కూడా తాగి వచ్చి భార్యని హింసించటం మొదలుపెట్టాడు సహదేవ్​. ఇంట్లో ఉన్న గొడ్డలితో బెదిరించాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు తల్లిని కొట్టకుండా అడ్డుపడ్డారు. తండ్రి చేతిలోని గొడ్డలిని లాక్కున్నారు. తండ్రిపై కోపంతో దాడి చేశారు. గొడ్డలితో నరికి చంపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చెరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఆ ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును ప్రారంభించారు.

ఇవీ చదవండి:ఫోన్ గురించి గొడవ- చెల్లిని నరికి చంపిన అన్న

భాజపా కార్యకర్తలకు, రైతులకు మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.