ETV Bharat / bharat

ఇద్దరు యువకుల రహస్య పెళ్లి.. ఇంట్లో వారికి తెలియగానే..

author img

By

Published : Apr 26, 2022, 10:13 PM IST

two boys get married: కుటుంబ సభ్యులకు తెలియకుండా హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అబ్బాయిలు వివాహం చేసుకున్నారు. అనంతరం సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే?

two boys get married
two boys get married

himachal pradesh boys marriage: హిమాచల్​ప్రదేశ్​లో వింత వివాహం జరిగింది. ఉనా నగరంలో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరాఖండ్​కు చెందిన అబ్బాయికి స్థానిక యువకుడు(24) తాళి కట్టాడు. ఆ రాష్ట్రంలో అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం ఆనోటా ఈనోటా వెళ్లి.. పోలీసుల వద్దకు చేరింది. అయితే, దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలని పోలీసులు మదనపడుతున్నారు.

ఉనాకు చెందిన యువకుడు.. తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఉత్తరాఖండ్ నుంచి ఓ యువకుడు వచ్చి వీరితో కలిశాడు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అనుమానించిన యువకుడి తమ్ముడు.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. ఈ విషయంపై గొడవ చేశారు. తమ కుమారుడికి ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వెంటనే యువకులు ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.

ఏడాదిన్నర క్రితమే వివాహం: ఫేస్​బుక్​ ద్వారా యువకులిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. దిల్లీలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు యువకులు తెలిపారు. అనంతరం ఉనాకు చెందిన యువకుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఉత్తరాఖండ్ యువకుడు.. హిమాచల్​లోని ఉనాకు చేరుకున్నాడు.

ఈ విషయం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. యువకులు తమను ఆశ్రయించిన నేపథ్యంలో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇద్దరం కలిసే ఉంటామని యువకులు చెబుతున్నారని స్థానిక పోలీసు అవుట్​పోస్ట్ ఇంఛార్జ్ జగ్​వీర్ సింగ్ తెలిపారు. యువకుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడనున్నట్లు చెప్పారు. వారితో చర్చించిన తర్వాతే ఈ విషయంపై ముందుకు వెళ్లగలమని అన్నారు.

ఇదీ చదవండి:

ధగధగలాడే 'గోల్డ్​ మాస్క్​'.. ధర ఎంతంటే...

గుజరాత్​లోనూ బుల్డోజర్లు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూల్చివేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.