ETV Bharat / bharat

'అతడ్ని పెళ్లి చేసుకో'.. బలవంతపెట్టిన భర్త.. 15 మందితో కలిసి దాడి

author img

By

Published : Apr 18, 2022, 4:03 PM IST

Updated : Apr 18, 2022, 4:54 PM IST

Tripura married woman incident: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొంతమందితో కలిసి భార్యపై దాడి చేశాడు ఓ భర్త. అనంతరం ప్రియుడినే పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడు. ఈ ఘటన త్రిపురలో జరిగింది. మరోవైపు రూ.100 కోసం సొంత అన్ననే చంపాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

tripura married woman incident
ప్రియుడితో పెళ్లికి భార్యను బలవంతపెట్టిన భర్త

Tripura married woman incident: భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో 15 మందితో కలిసి భార్యపై దాడి చేశాడు ఓ భర్త. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య స్పృహ కోల్పోయింది. ఆమె స్పృహలోకి రాగానే ప్రియుడిని వివాహం చేసుకోమని అక్కడున్న వారందరూ బలవంత పెట్టారు. కొంతమంది యువకులు మహిళ నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టమని ప్రియుడిని ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రియుడిని సైతం చితకబాదారు. ఈ ఘటన త్రిపురలోని కొవాయి జిల్లాలోని మధ్య కృష్ణాపుర్​లో శనివారం జరిగింది. బాధితురాలు నడివయస్కురాలని తెలియమురా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

తన భార్యకు అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బాధితురాలి భర్త తెలిపాడు. గాయాలతో బాధపడుతున్న భార్యను తెలియమురా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రస్తుత నాగరిక సమాజంలో మహిళలపై ఇలాంటి దాడులు జరగడం దారుణమని త్రిపుర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ బర్నాలి గోస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.100 కోసం సొంత అన్ననే: 100 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో సొంత అన్ననే చంపాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని షాధోల్​ జిల్లా బుదార్​ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. దీన్​దయాళ్​ పావ్(48), పృధ్వీదయాళ్ పావ్(50) అన్నదమ్ములు. ఇద్దరూ పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం దీన్​దయాళ్​ పావ్​ తన అన్న పృధ్వీదయాళ్ పావ్​ను రూ.100 అడిగాడు. పృధ్వీదయాళ్​ తన తమ్ముడికి డబ్బులను ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన దీన్​దయాళ్​ తన అన్న కొట్టగా.. అతను అక్కడికక్కడే మరణించాడు.

ఇదీ చదవండి: గ్యాస్​ లీకై కార్మికుడు విలవిల.. రక్షిద్దామని వెళ్లిన నలుగురు కూడా..

Last Updated : Apr 18, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.