ETV Bharat / bharat

Transgender Love Story: ఆ ఇద్దరూ ఇష్టపడ్డారు.. ట్రాన్స్​జెండర్​గా మారిన తర్వాత

author img

By

Published : Aug 17, 2023, 4:42 PM IST

Transgender Love Story: కాలేజీ రోజుల నుంచే వారి మనసులు కలిశాయి. సహజీవనం కూడా చేశారు. ఎలా అయినా పెళ్లి చేసుకుని.. జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. తన ప్రేమను గెలిపించుకోడానికి అమ్మాయిగా మారాలనుకున్నాడు. అవయవ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. తన సొమ్మంతా తన సహచరుడి చేతిలో పెట్టాడు. తీరా సీన్ కట్ చేస్తే.. సొమ్ము తీసుకొని అతను ముఖం చేటేశాడు. దీంతో ఆ ట్రాన్స్​జెండర్ పోలీసులను ఆశ్రయించింది.

Transgender Love Story
Transgender_Love_Story

Transgender Love Story: పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తన నుంచి డబ్బు తీసుకొని మోసానికి పాల్పడ్డాడంటూ ఓ ట్రాన్స్​జెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానంటూ నమ్మించి తన నుంచి నగదు మొత్తాన్ని తీసుకుని మోసగించాడంటూ ట్రాన్స్ జెండర్ చేసిన ఫిర్యాదుపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన పవన్ కుమార్ (ట్రాన్స్ జెండర్​గా మారిన తరువాత భ్రమరాంబిక) కృష్ణలంకకు చెందిన నాగేశ్వరరావులు సుమారు ఆరేళ్ల క్రితం కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాలలో బీఈడీ కలిసి చదువుకునే సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.

డిగ్రీ వరకు అబ్బాయిలా .. పీజీలో అమ్మాయిలా మారి..

ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారడంతో కళాశాలలో చదువు పూర్తయిన అనంతరం ఇద్దరూ 2013లో కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ సమీపంలో మగవారిగానే పరిచయం చేసుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. అదే సమయంలో కృష్ణలంకలో ట్యూషన్ పాయింట్​ను నిర్వహించారు. ట్యూషన్ పాయింట్​కు వచ్చే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వీరిద్దరూ మగవారిగానే తెలుసు.

అయితే కొద్ది రోజులకు ఇద్దరూ వివాహం చేసుకుందామన్న నిర్ణయానికి రావడంతో నాగేశ్వరరావు.. పవన కుమార్​ను దిల్లీ తీసుకెళ్లి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించి అతడి పేరును భ్రమరాంబికగా మార్చాడు. శస్త్ర చికిత్సకు ఖర్చు సొమ్ము సుమారు 11 లక్షల రూపాయలను భమరాంబికనే చెల్లించింది.

ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...

కొద్ది రోజులకు ట్యూషన్ పాయింట్​లో తన వాటాగా వచ్చిన సొమ్మును, అదే విధంగా పొలం విక్రయించగా వచ్చిన రూ. 20 లక్షలు కలిపి.. మొత్తంగా 25 లక్షల రూపాయలను వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో భ్రమరాంబిక.. నాగేశ్వరరావుకు ఇచ్చింది. ఇలా ఉండగా గతేడాది డిసెంబర్​లో పెళ్లికి నిరాకరించిన నాగేశ్వరరావు ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. తరువాత నాగేశ్వరరావు తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. గత్యంతరం లేని స్ధితిలో భ్రమరాంబిక పెనమలూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

నాగేశ్వరరావు మంగళగిరిలో ఉన్నాడన్న సమాచారంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల భ్రమరాంబిక మంగళగిరి పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం మొత్తం కృష్ణలంక కేంద్రంగా జరిగినందున అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా వారు సూచించారు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్​కు చేరుకున్న భ్రమరాంబిక వివాహం చేసుకుంటానంటూ నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడి, నగదు మొత్తాన్ని తీసుకుని మోసానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతడి తల్లి విజయలక్ష్మిలపై మోసం, నమ్మకద్రోహం, ట్రాన్స్ జెండర్ హక్కుల రక్షణ చట్టంపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్రాన్స్​జెండర్​తో యువకుడి పెళ్లి- ఇంట్లో తెలియగానే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.