ETV Bharat / bharat

వైజాగ్ వెళ్తూ పట్టాలు తప్పిన రైలు- నక్సల్స్​ పనేనా?

author img

By

Published : Dec 17, 2021, 12:59 PM IST

Train Derailment: ఛత్తీస్​గఢ్​లో 17 బోగీల గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. ​భాన్సీ-కమలూర్​ రైల్వే స్టేషన్ల మధ్య రైలు అదుపు తప్పడం వల్ల బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Goods train derail in Chhattisgarh
Goods train derail in Chhattisgarh

Train Derailment: ఛత్తీస్​గఢ్ దంతెవాడ​లో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. కిరండోల్​-విశాఖ రైల్వే లైనులో 17 బోగీలతో వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు అదుపు తప్పింది. దీంతో బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Goods train derailment
పట్టాలు తప్పిన బోగీలు
Goods train derailment
చెల్లచెదురుగా పడిన రైలు బోగీలు

ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా భాన్సీ-కమలూర్ స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 4.05 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్​ పల్లవ తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Goods train derailment
రైల్వే లైనుకు అడ్డుగా పడిన బోగీలు

నక్సలైట్ల హస్తం ఉందా?

ఈ ఘటన వెనుక నక్సలైట్లు ప్రమేయం ఉన్నట్లు అధికారులు తొలుత భావించారు. అయితే నక్సల్స్​కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకపోడం వల్ల వారి హస్తం లేనట్లు నిర్ధరించుకున్నారు.

"ఈ ప్రమాదం యాంత్రిక కారణాల వల్ల జరిగింది. ఘటనా స్థలంలో మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కదలికలు కనిపించలేదు. ప్రమాదం వెనుక నక్సల్స్​ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని అభిషేక్​ పల్లవ తెలిపారు. రైల్వే సిబ్బంది విచారణ తర్వాతే ఘటనకు కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.

జిల్లా రిజర్వు గార్డ్​(డీఆర్​జీ), రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​(ఆర్​పీఎఫ్​) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ట్రాక్​ పునర్నిర్మాణ పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి: తమ పొలంలోకి నీళ్లు రానివ్వొద్దన్నందుకు కాల్పులు- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.