ETV Bharat / bharat

మథుర వెళ్తుండగా విషాదం.. ట్రాక్టర్​- ట్రక్కు ఢీ.. ఆరుగురు భక్తులు మృతి

author img

By

Published : Aug 5, 2023, 4:59 PM IST

Updated : Aug 5, 2023, 5:32 PM IST

UP Tractor Accident : ట్రాక్టర్​, ట్రక్కు ఢీకొని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Tractor Accident Today
ట్రాక్టర్​ ట్రక్కు ఢీకొని భక్తులు మృతి

Tractor Accident Today : ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్​, ట్రక్కు ఢీకొని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్.. హాథ్రస్​ జిల్లాలోని సదాబాద్ రోడ్​లో.. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ట్రాక్టర్,​ ట్రాలీలో మొత్తం 45 మంది భక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారనివె ల్లడించారు. వీరంతా ఎటా జిల్లాలోని జలేసర్ నుంచి మథురలోని గోవర్ధన్‌కు వెళుతున్నారని వివరించారు.

ఈ ఘటనలో మృతులను విక్రమ్ (45), మాధురి (22), హేమలత (12), లక్ష్మీ (18), అభిషేక్ (20), విష్ణు (20)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి ట్రక్కు​ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

కాాగా సదాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, హాథ్రాస్ జిల్లా ఆసుపత్రి, అలీఘడ్​​లోని జేఎన్​ మెడికల్ కాలేజీ, ఆగ్రాలోని ఎస్​ఎన్​ మెడికల్ కాలేజీలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం కోసం పంపించినట్లు వారు వెల్లడించారు. ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

అమర్​నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 25మంది..
Maharashtra Road Accident Today : వారం రోజుల క్రితం కూడా మహారాష్ట్రలోని బుల్డాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ముంబయి-నాగ్​పుర్ హైవేపై వేకువజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Two Buses Collide In Maharashtra : లక్ష్మీనగర్ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై ప్రయాణికులతో వెళ్తున్న రెండు ప్రైవేట్​ ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అమర్​నాథ్ నుంచి బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నారు. నాసిక్ వైపు వెళ్తున్న బస్సులో 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

బ్రిడ్జ్​పై​ పనులు చేస్తుండగా సడెన్​గా వచ్చిన రైలు.. నదిలోకి దూకిన కార్మికుడు.. ఆ తర్వాత..

హరియాణాలో మళ్లీ 'ఆపరేషన్​ బుల్డోజర్'.. అనేక షాప్​లు కూల్చివేత.. దుకాణదారులు పరార్​

Last Updated : Aug 5, 2023, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.