ETV Bharat / bharat

కలెక్టర్​ పెద్దమనసు.. 200 మంది దివ్యాంగులకు ఫ్రీగా మూవీ షో.. స్పెషల్​ ఎఫెక్ట్స్​తో!

author img

By

Published : Dec 4, 2022, 9:26 PM IST

ఓ కలెక్టర్​ తన మంచి మనస్సును చాటుకున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్పెషల్​గా మూవీని చూపించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సందర్భంగా 200 మంది దివ్యాంగ విద్యార్థుల కోసం స్పెషల్​ షో వేయించారు. అయితే కలెక్టర్​ కూడా దివ్యాంగుడు కావడం గమనార్హం.

international day of disabled persons
తిరునెల్వేలి సబ్​ కలెక్టర్​ గోకుల్

కలెక్టర్​ పెద్దమనసు.. 200 మంది దివ్యాంగులకు ఫ్రీగా మూవీ షో.. పిల్లలు ఎంత ఆనందపడ్డారో!

ఆయనొక జిల్లా సబ్​ కలెక్టర్​.. పుట్టుకతో దృష్టిలోపం ఉన్నప్పటికీ అద్భుతమైన తెలివితేటలతో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్​ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. సబ్​ కలెక్టర్​గా పోస్టింగ్​ కొట్టి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తన మంచి మనసు చాటుకున్నారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం తమిళనాడులో విధులు నిర్వర్తిస్తున్నారు.

తిరునల్వేలి సబ్​ కలెక్టర్​ గోకుల్.. 200 మంది దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా లగ్జరీ ధియేటర్​లో మూవీ చూసేందుకు అవకాశం కల్పించారు​. ప్రత్యేక ఏర్పాటు చేసి 'పొన్నియన్​ సెల్వన్​-1' సినిమాని చూపించారు. ఆ 200 మందిలో అంధులు, బధిరులు ఉండడంవల్ల గోకుల్​.. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి.. ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలంతా ఎంతో సరదాగా చిత్రాన్ని తిలకించారు.

international day of disabled persons
తిరునెల్వేలి సబ్​ కలెక్టర్​ గోకుల్

"వికలాంగులకు అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు కల్పించాలి. ఈ మూడు గంటల సినిమాను వారంతా ఎంతో ఎంజాయ్​ చేస్తూ చూశారు. మూవీ అనంతరం వారు ఆనందంగా బయటకు వచ్చారు. కలలో కూడా వారు ఇంత సంతోషంగా ఉంటారని అనుకోలేదు. వారి ముఖాల్లో ఆ ఆనందం కనిపిస్తోంది. సాధారణంగా వారికి విద్యలో మాత్రమే సమాన అవకాశాలు కల్పిస్తారు. కానీ వారికి వినోదం, క్రీడల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అందుకే నేను ఈ ప్రయత్నం చేశాను.'
-- గోకుల్​, తిరునెల్వేలి సబ్​ కలెక్టర్​

"నేను నా జీవితంలో ఎప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఏర్పాటు చేయాలి" అంటూ ఓ విద్యార్థి ఆనందాన్ని పంచుకున్నాడు. మొత్తానికి తమకు ఈ అవాకశం కల్పించినందుకు గోకుల్​కు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు.

international day of disabled persons
సినిమా చూస్తున్న విభిన్నప్రతిభావంతులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.