కేబుల్​ కార్​కు రిపేర్.. గాల్లోనే పర్యటకులు .. అనేక గంటలు నరకం!

author img

By

Published : Jun 20, 2022, 3:40 PM IST

Updated : Jun 20, 2022, 5:16 PM IST

timber-trail-ropeway-accident
కేబుల్​ కార్​లో సాంకేతిక సమస్య ()

Ropeway accident: హిమాచల్​ ప్రదేశ్​లోని ఓ పర్యటక కేంద్రంలోని రోప్​వేలో సాంకేతిక సమస్య తలెత్తింది. 11 మంది ఉన్న కేబుల్ కారు గాల్లోనే నిలిచిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి అందరినీ కాపాడాయి.

కేబుల్​ కార్​కు రిపేర్

Timber trail ropeway accident: హిమాల్​ప్రదేశ్ సోలన్​ వ్యాలీలోని పర్వానూ టింబర్​ ట్రెయిల్​​ రోప్​వే ఎక్కిన పర్యటకులు.. అనేక గంటలపాటు ప్రత్యక్ష నరకం చూశారు. సాంకేతిక సమస్యతో కేబుల్ కార్​ మధ్యలోనే నిలిచిపోగా.. అందులోని 11 మంది ప్రయాణికులు గాల్లోనే చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. వెంటనే ఇద్దరిని సురక్షితంగా కాపాడాయి. కేబుల్​ కారులో ఉన్న మిగతా 9 మందిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. గంటల పాటు శ్రమించి అందరినీ సురక్షితంగా కిందకు దించాయి.
ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, కేబుల్ కారులోని పర్యటకులంతా సురక్షితంగా ఉన్నారని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఓంకార్ చాంద్ శర్మ వెల్లడించారు.

Last Updated :Jun 20, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.