ETV Bharat / bharat

వరద ప్రాంతాల్లో పడవల్లోనే టీకా పంపిణీ

author img

By

Published : Jul 10, 2021, 8:13 PM IST

అసలే కరోనాతో కకావికలమవుతుంటే.. బిహార్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో టీకా పంపిణీ కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. అయితే, మనసుంటే మార్గముంటుందనే నానుడిని నిజం చేస్తూ.. అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పడవల్లోనే టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి వరద ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేపడుతున్నారు.

Tika boat started in flood affected area in Muzaffarpur
వరద ప్రాంతాల్లో పడవల్లోనే టీకా పంపిణీ

వరద ప్రాంతాల్లో పడవల్లోనే టీకా పంపిణీ

100 శాతం వ్యాక్సినేషనే లక్ష్యంగా బిహార్​లోని ముజఫర్​పుర్ జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరద ప్రాంతాల్లో ప్రత్యేక పద్ధతిలో టీకా పంపిణీ చేపడుతున్నారు. జిల్లాలోని కత్రా బ్లాకులో పడవల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tika boat started in muzaffarpur
టీకా నావ
Tika boat started in muzaffarpur
.

వరద ప్రాంతాలకు వైద్య సిబ్బంది ఈ పడవల ద్వారా వెళ్లి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. స్థానిక సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ శర్మ ఈ టీకా పడవలను ఆవిష్కరించారు.

Tika boat started in muzaffarpur
పడవలో టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారుడు

"జిల్లా మేజిస్ట్రేట్ ఆలోచన మేరకు పడవల్లో టీకా కేంద్రాలను ఆవిష్కరించాం. వరద ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో తొలిసారి ఇలా విభిన్న పద్ధతిలో టీకా పంపిణీ చేపడుతున్నాం. ఇద్దరు నర్సులు, ఇద్దరు నిపుణులైన నావికులు పడవలో ఉంటారు."

-డాక్టర్ వినయ్ కుమార్ శర్మ, సివిల్ సర్జన్

వరద ప్రభావం ఉన్న కత్రాలోని 14 పంచాయతీలలో పడవ ద్వారా టీకా పంపిణీ చేపడుతున్నట్లు వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం పడవను జిల్లా యంత్రాంగం సమకూర్చిందని చెప్పారు. నర్సులను జిల్లా వైద్య శాఖ అందుబాటులో ఉంచుతోందని వివరించారు.

Tika boat started in muzaffarpur
.
Tika boat started in muzaffarpur
టీకా నావలో నర్సులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.