ETV Bharat / bharat

Threatening Mail To Mukesh Ambani : ​అంబానీకి మూడోసారి బెదిరింపు మెయిల్​.. రూ.400కోట్లు డిమాండ్​.. లేకపోతే షూటర్లతో..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 9:18 AM IST

Updated : Oct 31, 2023, 9:44 AM IST

Threatening Mail To Mukesh Ambani : ముకేశ్​ అంబానీకి మూడోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ సారి రూ.400కోట్లు డిమాండ్​ చేశారు ఆగంతకులు. ఆ మొత్తాన్ని ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.

Threatening Mail To Mukesh Ambani
ముకేశ్​అంబానీకి మూడో సారి బెదిరింపు మెయిల్

Threatening Mail To Mukesh Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్​ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. అంబానీకి ఇప్పటికే రెండు సార్లు ఇలా బెదిరింపు మెయిళ్లు రాగా.. మూడోసారి కూడా అదే అకౌంట్​ నుంచి మెయిల్​ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా వచ్చిన మెయిల్​లో రూ.400 కోట్లు డిమాండ్​ చేశాడు ఆగంతకులు. భారత్​లో తమ వద్ద మంచి షూటర్లు ఉన్నారని.. ఆ మొత్తం ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని ముకేశ్​ను బెదిరించారు.

సోమవారం వచ్చిన ఈ మెయిల్​పై ముంబయిలోని గామదేవి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్​ అంబానీ ఇంట్లో సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. కాగా అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ.. ముకేశ్​ అంబానీకి ఓ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఆ తరువాత మరో రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తూ ఇంకో మెయిల్​ పంపించారు ఆగంతకులు.

అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపులు..
గతంలోనూ అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఆగస్టు 15న ఓ వ్యక్తి నుంచి హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఆ ఆసుపత్రి నడుస్తోంది. హాస్పిటల్​ను పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని.. నిందితుడు ఆ సమయంలో బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

కారులో పేలుడు పదార్థాలు..
2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ కారును పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే ఆ కారు యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో వాజేను అరెస్టు చేశారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు జెడ్​ ప్లస్​ భద్రత కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Mukesh Ambani Children Salary : జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ పిల్లలు.. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

శరద్ పవార్​కు బెదిరింపులు​.. ఆయనలా చంపుతామంటూ..

Last Updated : Oct 31, 2023, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.