Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

author img

By

Published : Nov 20, 2021, 7:05 AM IST

Those who led the farmers' movement

సాగుచట్టాలపై రైతుల ఉద్యమం (Farmers movement) సుదీర్ఘంగా సాగింది. ఈ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా వారు ఎన్నడూ పోరుబాట వీడలేదు. వారి సంకల్ప బలానికి.. పలువురు రైతుసంఘ నాయకుల (Farmer leaders in India) మార్గదర్శనం తోడవడమే అందుకు కారణం! లక్ష్య సాధన దిశగా అన్నదాతలను ఆ నేతలు ముందుండి నడిపించారు. వారిలో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపారు. అలాంటి నాయకుల్లో వైద్యులు, మాజీ సైనికులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మాజీ పోలీసులు ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది ముఖ్యుల వివరాలివీ..

దాదాపు ఏడాదికిపైగా రైతు ఉద్యమం (Farmers movement) నిరాటంకంగా సాగడానికి కొందరు రైతు నాయకులు (Farmer leaders in India) ఎంతగానో పోరాటం చేశారు. అన్నదాతల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూ.. వారిని ముందుండి నడిపించారు. అందులో మొదట చెప్పుకోవాల్సింది భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్​ టికాయిత్ (Rakesh tikait news)​. ఈయనే కాక మరికొంత మంది సాగు చట్టాలపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.

1. రాకేశ్‌ టికాయిత్‌

Those who led the farmers' movement
రాకేశ్​ టికాయిత్​

ఈయన భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి (Bharatiya Kisan Union). తాజా పోరాటంలో అన్నీతానై వ్యవహరించారు. సహచరులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఉద్యమం దీర్ఘకాలం సాగుతుండటంతో అన్నదాతలు నీరుగారిపోకుండా తన ప్రసంగాలతో ఎప్పటికప్పుడు (Farmers protest reason 2020) వారిలో ఉత్సాహం నింపారు. పలు సందర్భాల్లో ఈయన కన్నీరు పెట్టుకోవడం చూసి రైతు కుటుంబాలు చలించిపోయాయి. ఆయన పిలుపునకు స్పందించి పోరాటంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో ముందుకువచ్చాయి. ప్రభుత్వంతో చర్చల్లో టికాయిత్‌ కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు ఈయన దిల్లీలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.

2. దర్శన్‌ పాల్‌

Those who led the farmers' movement
దర్శన్‌ పాల్‌

అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ కార్యనిర్వాహక బృందంలో సభ్యుడు. వృత్తిరీత్యా వైద్యుడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 70 ఏళ్ల వయసులోనూ.. కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని(Farmers movement) విస్తరింపజేయడంలో ప్రధాన భూమిక పోషించారు.

3. జోగిందర్‌సింగ్‌ ఉగ్రాహాన్‌

Those who led the farmers' movement
జోగిందర్‌సింగ్‌ ఉగ్రాహాన్‌

భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రాహాన్‌) అధ్యక్షుడు. గతంలో సైన్యంలో సేవలందించారు. ఈయన నేతృత్వంలోని బృందం పంజాబ్‌లో దూకుడుగా నిరసనలు చేపట్టింది. రైల్‌ రోకో, భాజపా నేతల ఘెరావ్‌ వంటి ఆందోళనలతో (Farmers protest latest news) అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎక్కువ శాతం రైతుసంఘాలు సింఘు సరిహద్దులో నిరసనలు చేపట్టగా.. జోగిందర్‌ బృందం టిక్రి సరిహద్దులో ఆందోళనల బాధ్యతను అన్నీతానై చూసుకుంది.

4. బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌

Those who led the farmers' movement
బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌

భారతీయ కిసాన్‌ యూనియన్‌ (రాజేవాల్‌) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. రైతు సంఘాలు (Indian farmers' protest leaders) ఉమ్మడిగా నిరసనల ప్రణాళికలు రచించడంలో, వాటిని అమల్లో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రైతు డిమాండ్ల పత్రానికి రూపకల్పన చేయడంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. చట్టాలపై రైతుల అభిప్రాయమేంటో.. చర్చల సమయంలో ప్రభుత్వానికి నిక్కచ్చిగా వివరించారు.

5. హన్నన్‌ మొల్లా

Those who led the farmers' movement
హన్నన్‌ మొల్లా

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు. అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి. వయసు 75 ఏళ్లు. నూతన సాగుచట్టాలను పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా రద్దు చేసేవరకు నిరసనలు(Farmers protest reason 2020) కొనసాగిస్తామని ఆదినుంచీ స్పష్టంగా చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై రైతులకు హామీ ఇస్తూ చట్టం చేయాలని బలంగా డిమాండ్‌ చేశారు.

6. గుర్నాంసింగ్‌ చఢూనీ

Those who led the farmers' movement
గుర్నాంసింగ్‌ చఢూనీ

గతంలో అనేక నిరసనలను విజయవంతంగా నడిపించారు. సాగుచట్టాలపై పోరాటంలోనూ(Farmers movement) కీలకంగా వ్యవహరించారు. వాటికి పార్లమెంటులో ఆమోదముద్ర పడక ముందునుంచే రైతులను ఉద్యమానికి సిద్ధం చేశారు.

7. సుఖ్‌దేవ్‌సింగ్‌ కొక్రికాలన్‌

Those who led the farmers' movement
సుఖ్‌దేవ్‌సింగ్‌ కొక్రికాలన్‌

ఈయన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) ప్రధాన కార్యదర్శి. విశ్రాంత ఉపాధ్యాయుడు. వయసు 71 ఏళ్లు. ‘దిల్లీ చలో’ పిలుపు సమయంలో పోలీసులను ముందుండి ఎదుర్కొన్నారు.

ఈ ఉద్యమంలో (Farmers protest latest news) స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్రయాదవ్‌ కూడా కీలకంగా వ్యవహరించారు.

ఇవీ చూడండి: Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

'సాగు చట్టాలు ఇప్పుడే రద్దైనట్టు కాదు.. ఇంకా చాలా ఉంది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.