ETV Bharat / bharat

SBIలో బంగారం చోరీకి పక్కా ప్లాన్​.. 10 అడుగుల సొరంగం తవ్వి..

author img

By

Published : Dec 24, 2022, 12:26 PM IST

thieves dig 10 feet tunnel
చోరీ చేస్తున్న దొంగ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో 10 అడుగుల పెద్ద సొరంగం తవ్వి బంగారం దోపిడీ చేశారు దుండగులు. ఎస్‌బీఐ భనుతి శాఖలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఉద్యోగులు కార్యాలయానికి రాగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పెద్ద సొరంగం తవ్వి బంగారం దోపిడీ చేశారు దుండగులు. ఎస్‌బీఐ భనుతి శాఖలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఉద్యోగులు కార్యాలయానికి రాగా.. వెలుగులోకి వచ్చింది. పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి లోపలికి చేరుకున్నారు. లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. ఎంత దోపిడీ చేశారో నిర్ధారించడానికి అధికారులకు గంటలకొద్ది సమయం పట్టింది.

"వేలి ముద్రలు, ఇతర ఆధారాల ద్వారా దొంగలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకు నిర్మాణం బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారు. మరో లాకర్‌లో ఉన్న రూ.32 లక్షలను దొంగిలించడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారు" అని డీజీపీ విజయ్‌ డూల్‌ అన్నారు. కేసును ఛేదించడానికి సీనియర్‌ అధికారుల నేతృత్వంలో, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, పలు పోలీసు బృందాలు పనిచేస్తున్నట్లు సీపీ బీపీ జోగ్దండ్‌ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భానుతి బ్రాంచ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి నాలుగు అడుగుల వెడల్పుతో సొరంగం తవ్వి స్ట్రాంగ్‌రూమ్‌లోకి చొరబడ్డారు దొంగలు. నగదును తీసుకోవడానికి ప్రయత్నించగా అది విఫలం అయ్యింది. అనంతరం బంగారాన్ని దొంగలించారు. ఆ బంగారం సుమారు 1.8 కిలోలకు పైగా ఉందని, దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డూల్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.